ద్రావిడ్ కు లక్షణ్ చేసిన పెద్ద సాయం ఏంటంటే...

August 11, 2015 | 04:14 PM | 1 Views
ప్రింట్ కామెంట్
vvs_laxman_rahul_dravid_friendship_relationship_niharonline

భారత టెస్ట్ క్రికెట్ లో కలకాలం గుర్తుండిపోయే ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్. ఆపద సమయంలో ఓటమికి అడ్డుగా ‘గోడలా’ నిలిచి ఎన్నో విజయాలను తన ఒంటి చేత్తో అందించాడు. అలాంటి క్రికెటర్ కి బెస్ట్ ఫ్రెండ్ ఎవరో మీకు తెలుసా? అతగాడెవరో కాదు మరో టెస్ట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ అట. ఈ విషయాన్ని స్వయంగా ద్రావిడే చెబుతున్నాడు.

చెన్నైలో మద్రాస్ క్రికెట్ క్లబ్ లో సోమవారం మాజీ క్రికెటర్లతో ఓ కార్యక్రమం నిర్వహించారు. దీనికి ఈ ఇద్దరు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ద్రావిడ్ లక్ష్మణ్ తో తనకున్న రిలేషన్ ను పంచుకున్నాడు. ఈ కార్యక్రమానికి ఫార్మల్ డ్రెస్ కోడ్ లో రావాలని నిర్వాహకులు సూచించారు. కానీ,  నా దగ్గర అన్నీ జీన్సే. వెంటనే నేను నా స్నేహితుడికి ఫోన్ చేసి ఫార్మల్ కావాలని కోరాను. సీన్ కట్ చేస్తే వెంటనే నేను మేముందు ఇలా ... అని చెప్పుకొచ్చాడు. ఇదే కాదు నాకు ఏ సమస్య వచ్చినా వెంటనే లక్ష్మణ్ కి చెబుతాను. ఎందుకంటే నాకున్న బెస్ట్ ఫ్రెండ్ అతనే. ఏ సాయమైనా ముందుకొచ్చేవాడని చెప్పుకొచ్చాడు.

అంతేకాదు ఈడెన్ గార్డెన్ లో ఆస్ట్రేలియాతో కలిసి వీరిద్దరు కలిసి నెలకొల్పిన 376 పరుగుల భాగస్వామ్యాన్ని ద్రావిడ్ గుర్తుచేశాడు. ఆ డీవీడీని ఇప్పటికీ నేను చూస్తాను. అందులో లక్ష్మణ్ బ్యాటింగ్ స్టైల్ చాలా కష్టంగా ఉంటుంది. షేన్ వార్న్ బౌలింగ్ లో లక్ష్మణ్ ఆడిన షాట్ లు చూస్తే నాకు మతి పోయింది అంటూ  ద్రావిడ్ లక్ష్మణ్ ని ఆకాశానికెత్తేశాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ