భూ వివాదంలో క్రికెటర్ భువనేశ్వర్

August 10, 2015 | 02:39 PM | 2 Views
ప్రింట్ కామెంట్
Bhuvneshwar_Kumar_life_threat_land_issue_niharonline

మైదానంలో బంతి పట్టి ప్రత్యర్థుల దుమ్ము దులిపే ఈ యంగ్ బౌలర్ కి ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో పెద్ద చిక్కు వచ్చిపడింది. తాజాగా టీమిండియా యువ పేస్ భువనేశ్వర్ ఓ భూ వివాదంలో చిక్కుకున్నాడు. భువనేశ్వర్, అతని తండ్రి కిరణ్ పాల్ సింగ్‌లకు ఓ భూ కొనుగోలు విషయంలో ప్రస్తుతం బెదిరింపులు వస్తున్నాయట.

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్షార్ జిల్లా నివాసి రణవీర్ సింగ్ నుంచి రూ. 80 లక్షలకు వీరు భూమిని కొనుగోలు చేశారు. భూమి కొనుగోలుకు సంబంధించి మొత్తం డబ్బును నెట్ బ్యాంకింగ్ ద్వారా బదిలీ చేశారు. అయితే, రణవీర్ వీరి పేరిట భూమిని ట్రాన్స్‌ఫర్ చేయలేదు. అంతేకాదు డబ్బును తిరిగి ఇవ్వడానికి కూడా నిరాకరించాడు. ఈ క్రమంలోనే భువనేశ్వర్‌కు, అతని తండ్రికి బెదిరింపులు వచ్చాయి. రణవీర్ సింగ్ ప్రస్తుతం ఓ హత్య కేసులో జైల్లో ఉన్నాడు. తమకు వచ్చిన బెదిరింపులపై భువనేశ్వర్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో, రణవీర్‌తో పాటు మరో ఐదుగురిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు, భువనేశ్వర్ ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్నాడు. మైదానంలోనే క్రీడాకారులను వ్యక్తిగత జీవితంలోనూ అప్పుడప్పుడు సమస్యలు చుట్టుముడుతుంటాయన్నది భువనేశ్వర్ ఉదంతం ద్వారా అర్థమైపోతుంది

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ