వన్డేలకు మాత్రమే బెల్ బై బై

August 29, 2015 | 05:17 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Ian_Bell_good_bye_to_ODIs_niharonline.jpg

క్రికెట్ ప్రపంచంలో  స్టార్లుగా కొందరు వెలుగుతారు. అలాంటి స్టార్లలో మరికొందరు అభిమానుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతారు. ఈ మధ్యే సంగక్కర క్రీడా ప్రపంచం నుంచి రిటైర్మెంట్ తీసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ  జాబితాలో తాజాగా మరో స్టార్ బ్యాట్స్ మెన్ మరోకరు ఇప్పుడు చేరాడు.  ప్రముఖ ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్ మెన్ ఇయాన్ బెల్ అంతర్జాతీయ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. యాషెస్ సిరీస్ గెలిచిన అనంతరం మీడయా సమావేశం నిర్వహించిన బెల్ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. టెస్ట్ లపై మరింత శ్రద్ధ పెట్టేందుకే తాను వన్డేల నుంచి తప్పుకోకున్నట్లు బెల్ తెలిపాడు. అయితే  తొలుత పొరపాటున అన్ని ఫార్మట్ లకు బెల్ వీడ్కోలు చెబుతున్నాడని అక్కడి మీడియా వార్తలు ప్రకటించింది. అయితే తాను కేవలం వన్డేలకు మాత్రమే గుడ్ బై చెబుతున్నానని బెల్ స్పష్టం చేశాడు. కాగా, ఇంగ్లాండ్ తరపున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా బెల్ రికార్డు నెలకొల్పాడు. మొత్తం 161 వన్డేలు ఆడిన బెల్ 5,416 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 34 అర్థ సెంచరీలు ఉన్నాయి. ఐసీసీ తరపు నుంచి ఇప్పటి వరకు 4 సార్లు ఉత్తమ ఫీల్డర్ గా ఇయాన్ బెల్ అవార్డులు పొందాడు.  

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ