కోహ్లీ ఆరాటం ఎక్కువ... పోరాటం తక్కువ

January 02, 2016 | 12:43 PM | 1 Views
ప్రింట్ కామెంట్
kohli gundappa viswanath niharonline

టీమిండియా స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ ఆటతీరు మెరుగు పరుచుకోకపోతే చాలా కష్టమట. చివరికి అది అతని కెరీర్ ను ప్రమాదంలోకి నెట్టే ప్రమాదం ఉందని వెటరన్ గుండప్ప విశ్వనాథ్ అభిప్రాయపడ్డాడు. కెప్టెన్ గా కోహ్లీ ఓకే కానీ, టెస్టుల్లో అతని ఆటతీరు ఎంతో మారాలని ఆయన సూచించాడు. వన్డేలు, టీట్వంటీలకు కోహ్లీ బ్యాటింగ్ సరిపోతుందని అయన చెప్పాడు. ఈ రెండు ఫార్మాట్లలో షాట్లు ఆడాల్సి ఉంటుందని, అలాంటప్పుడు సాహసోపేతమైన ప్రయోగాలు చేయాల్సి ఉంటుందని, అప్పుడు విఫలమైనా పెద్దగా బాధపడక్కర్లేదని ఆయన తెలిపాడు. అదే టెస్టుల్లో సాహసోపేతమైన షాట్లు ఆడాల్సిన అవసరం లేదని, ఎంపిక చేసుకున్న షాట్లు ఆడితే సరిపోతుందని, కోహ్లీ మాత్రం నిర్లక్ష్యంగా ఒకేరకమైన షాట్లు ఆడుతూ వికెట్ పారేసుకుంటున్నాడని ఆయన పేర్కొన్నారు. ఇలాగే కొనసాగితే కోహ్లీ కెరీర్ ముగిసినట్లేనని ఆయన అభిప్రాయపడ్డాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ