మాజీకోచ్ కి మళ్లీ ఉద్వాసన

December 08, 2015 | 12:21 PM | 2 Views
ప్రింట్ కామెంట్
gary-kirsten-terminated-from-delhi-dare-devils-head-coach-niharonline

భారతదేశం 28 ఏళ్ల కలను సాకారం చేసిన వ్యక్తిగా గ్యారీ కిర్ స్టన్ మనకు గుర్తిండిపోయాడు. 1983 లో కప్ గెలిచిన భారత్ మళ్లీ 2011లో కప్ అందుకుందంటే కోచ్ గా గ్యారీ అందించిన కృషి మరువలేనిదే. ఆటగాళ్లలో మనోస్ఫూర్తి నింపటంలో ఈ దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడి పనితనం బాగా పనిచేసింది. అయితే ప్రపంచకప్ వన్డే టీంలో భారత్ ను చాంఫియన్ గా నిలబెట్టిన ఈ మాజీ కోచ్ పొట్టి ఫార్మట్ లో మాత్రం విఫలమయ్యాడు.

గ్యారీ ప్రస్తుతం ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ డేర్‌డెవిల్స్ చీఫ్ కోచ్ గా ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కోచ్‌గా పేరు తెచ్చుకున్న గ్యారీ ఐపీఎల్‌లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. రెండు సీజన్లపాటు ఢిల్లీ జట్టుకు కోచ్‌గా ఉన్నా చివరి నుంచి రెండో స్థానంలో నిలవాల్సి వచ్చింది. దీంతో ఆయనను కోచ్ బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్లు ఢిల్లీ డేర్ డెవిల్స్ యాజమాన్యం ప్రకటించింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ