పిచ్ పై పగ తీర్చుకుంటున్నారే!

December 02, 2015 | 10:44 AM | 2 Views
ప్రింట్ కామెంట్
ICC_Match_Referee_rates_Nagpur_pitch_as_poor_niharonline

క్రికెట్ అంటే ఓ క్రేజ్... నువ్వా నేనా అన్న రేంజ్ లో జరిగే మ్యాచ్ లకు ఉండే గిరాకీ అంతాఇంతా కాదు. వన్డే, టెస్ట్, టీ20 ఇలా ఫార్మట్ ఏదైనా సరే ఎగబడి చూసేయటం ఫ్యాన్స్ వంతు. మరి అలాంటి వారికి ఉత్సాహాన్ని పంచాల్సింది పోయి, నీరసం కలిగిస్తే ఎలా?.  టెస్టు మ్యాచ్ అంటే ఐదు రోజుల ఆట. కానీ, మూడంటే మూడు రోజుల్లో ముగిసిపోతే ఎలా ఉంటుంది. తాజాగా నాగ్ పూర్ టెస్ట్ లో జరిగిన తంతు అందిరికీ తెల్సిందే. చప్పగా సాగిన ఈఆట ఆరంభం నుంచి విజయం ఓ వైపే మొగ్గింది. ఇరు జట్లలోని స్పిన్నర్లు బంతిని గింగిరాలు తిప్పారు. పరుగులు రాబట్టేందుకు బ్యాట్స్ మెన్ నానా తంటాలు పడ్డారు. మూడు రోజుల వ్యవధిలోనే ఇరు జట్లు రెండు సార్లు ఆలౌటయ్యాయి. వెరసి ఏకపక్షంగా సాగిన మ్యాచ్ లో టీమిండియా సఫారీలపై రికార్డు విజయాన్ని నమోదు చేసింది.

                                    ఇప్పుడీ మ్యాచ్ పై జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. పిచ్ ను స్పిన్ కు అనుకూలంగా సిద్ధం చేయడంతోనే ఇదంతా జరిగిందని కూడా దాదాపుగా అందరూ ఓ నిర్ధారణకు వచ్చేశారు. కాస్త ఆలస్యంగా మేల్కొన్న ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నాగ్ పూర్ పిచ్ పై కొరడా ఝుళిపించింది. పిచ్ కు ఎల్లో కార్డు జారీ చేసిన ఐసీసీ రిఫరీ జెఫ్ క్రౌ దీనిపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. విచారణలో భాగంగా పిచ్ పనితీరు పేలవంగా ఉందని తేలితే భారీ జరిమానా విధించేందుకు కూడా ఐసీసీ రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అన్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ సొంతూరు నాగ్ పూరే కావటంతో ఇంత రచ్చ జరుగుతుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయం వెలిబుచ్చుతున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ