నాగ్ పూర్ టెస్ట్ ముగించేశారు

November 27, 2015 | 03:39 PM | 1 Views
ప్రింట్ కామెంట్
india-won-nagpur-test-by-124-runs-niharonline

నాగ్ పూర్ టెస్ట్ లోనూ స్పిన్ మంత్రం ఫలించింది. మొదటి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు కూల్చిన అశ్విన్ రెండో ఇన్నింగ్స్ లోనూ చెలరేగిపోయాడు. ఏడు వికెట్లు పడగొట్టి సఫారీల పతనం శాసించాడు. వెరసి 185 పరుగులకే సౌతాఫ్రికా అలౌట్ అవ్వగా, భారత్ 124 పరుగుల తేడాతో విజయం సాధించింది. మరోవైపు మిశ్రా మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు..

దుమ్మురేగుతున్న పిచ్, స్పిన్ బౌలింగ్ కు పూర్తిగా సహకరించడంతో, ఉపఖండపు స్పిన్ పిచ్ లపై పెద్దగా అనుభవం లేని సౌతాఫ్రికా ఆటగాళ్లు తెల్లమొహం వేశారు. రెండో ఇన్నింగ్స్ లో 310 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టు 89.5 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌట్ అయింది. ప్లెసిస్, ఆమ్లాల చెరో 39 పరుగులు కాసేపు టెన్షన్ పెట్టారు. వారిద్దరు మినహా మరెవరూ రాణించలేకపోయారు. 12 వికెట్లు కూల్చి సఫారీలను సఫా చేసిన అశ్విన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ