ఇకపై బ్యాటింగ్ పవర్ ప్లే ఉండదు

June 27, 2015 | 01:12 PM | 3 Views
ప్రింట్ కామెంట్
ICC_ODI_cricket_batting_power_play_trashed_niharonline

ఆ మధ్య అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిబంధనల మార్పు పేరిట చేసిన పనితో బౌలర్లకు చుక్కలు కనిపించాయి. టీ20 ఫార్మట్ తెరపైకి రావటంతో వన్డే కి క్రేజ్ తగ్గిపోతుందన్న ఆందోళనతో వన్డేలో అనూహ్య మార్పులు చేసింది ఐసీసీ. అయితే ప్రస్తుతం వన్డే ఫార్మాట్ పూర్తి బ్యాన్స్ మెన్ ఆటగా మారిందని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీంతో వాటిని పరిగణనలోకి తీసుకున్న క్రికెట్ మండలి నిబంధనలు సవరించినట్లు ప్రకటించింది. దీని ప్రకారం ఇక పై వన్డేల్లో బ్యాటింగ్ పవర్ ప్లే ఉండదు. అంతేకాదు చివరి 10 ఓవర్లలో 30 గజాల సర్కిల్ అవతల ఐదుగురు ఫీల్డర్లను మోహరించేందుకు అనుమతిచ్చింది. గతంలో చివరి 10 ఓవర్లలో బ్యాట్స్ మెన్ ఎవరైనా సరే ఫీల్డర్లు లేకపోవటంతో ఇష్టమొచ్చినట్లు బాదేవారు. దీంతో స్కోర్ బోర్డు ఉరకలు వేసేది. ఇక ఇప్పుడు ఈ నిబంధనతో బౌలర్లకు కాస్త ఊరట కలుగుతుందనే చెప్పాలి. అంతేకాదు బౌలింగ్ క్రీజును పాదం దాటితేనే ప్రకటించే ఫ్రీ హిట్ ను ఇక ఏ తరహా నోబాల్ కైనా వర్తించేలా ఐసీసీ ప్రకటించింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ