ఐపీఎల్ కొంపముంచుతుందా?

September 29, 2015 | 12:55 PM | 2 Views
ప్రింట్ కామెంట్
Du-Plessis-confidence-on-india-t20-series-IPL-niharonline

ఐసీసీ కన్నా రిచ్ అయిన మన క్రికెట్ బోర్డు(బీసీసీఐ) ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశీవాలీతోపాటు అంతర్జాతీయ క్రీడాకారులను ఒక టీంలో చేర్చి టీ20 ఆడించడం తద్వారా లాభాలతోపాటు ప్రేక్షకులకు మజా అందించడంలో ఐపీఎల్ పాత్ర ఎనలేనిది. మధ్యలో ఎన్ని ఆరోపణలు, విమర్శలు వచ్చినా సరే ఏటా దీని క్రేజ్ పెరుగుతుందే తప్ప అస్సలు తగ్గలేదు. దీనిద్వారా దేశీ ప్లేయర్లలోని టాలెంట్ ను వెలికితీసి వారిని అంతర్జాతీయ వేదికపై పరిచయం చేసేందుకు ఓ చక్కని వేదికైంది. అదే టైంలో విదేశీ ఆటగాళ్లు ఉపఖండం పిచ్ పై అలవాటు అయ్యేందుకు కూడా పరోక్షంగా సహకరించిందనటంలో సందేహం లేదు.

                    అయితే ఈ ఐపీఎలే ఇప్పుడు భారత్ విజయావకాశాలను దెబ్బ తీసే చాన్స్ పుష్కలంగా కనిపిస్తుంది. ఎందుకు? ఎలా? అంటారా? త్వరలో భారత్ సౌతాఫ్రికా మధ్య టీ20 సిరీస్ జరగనుంది. అయితే ఐపీఎల్ లో ఆడిన అనుభవంతో భారత్ ను ఓడిస్తామని సౌతాఫ్రికా ధీమా వ్యక్తంచేస్తుంది. కెప్టెన్ డుప్లెసిస్ మాట్లాడుతూ, టీట్వంటీ సిరీస్ లో సహజసిద్ధంగా ఆడుతామని అన్నాడు. తమ జట్టులోని చాలా మంది ఆటగాళ్లకు ఐపీఎల్ లో ఆడిన అనుభవం ఉందని, దానిని ఉపయోగించుకుంటామని డుప్లెసిస్ చెప్పాడు. ఐపీఎల్ నుంచి తాము చాలా నేర్చుకున్నామని తెలిపాడు. ఈ సిరీస్ సందర్భంగా ఐపీఎల్ లో టీట్వంటీలు ఆడిన అనుభవం ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నానని డుప్లెసిస్ అభిప్రాయపడ్డాడు. మనం ప్రవేశపెట్టిన ఈ పొట్టి ఆటతో మన కొంపే మునగదు కదా?

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ