పగతో రగిలిపోతున్న టీమిండియా

September 28, 2015 | 03:50 PM | 1 Views
ప్రింట్ కామెంట్
team_india_revange_of_series_niharonline.jpg

అప్పట్లో..అంటే ఓ రెండు సంవత్సరాల క్రితం ధోని నాయకత్వంలో భారత జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటించినప్పుడు అనుభవం లేని లైనప్ అంటూ కామెంట్స్ చేశారు. అయితే తొలి టెస్టులో ప్రత్యర్థిని ఓడించినంత పని చేసినా విజయాన్ని అందుకోలేక పోయింది. ఇప్పుడు జట్టు ఆటతో పాటు ఆలోచనా ధోరణి కూడా మారింది. అంటే వీరి దూకుడు అన్ని చోట్లా కనిపిస్తుంది. క్రితం జట్టుతో పాలిస్తే ఎక్కువగా మార్పులు లేకపోయినా.. యువ క్రికెటర్లంతా ఎంతో మెరుగై కావాల్సినంతగా రాటుదేలారు. సొంతగడ్డపైనే సిరీస్ జరుగుతోంది. 2013-14 పర్యటనలో ఒక్క విజయమూ లేకుండా నిరుత్సాహంతో తిరిగొచ్చిన టీమిండియా ఆటగాళ్లు టెస్టులు, వన్డేలు రెండింట్లోనూ ప్రతీకార భావంతో మరియు పట్టుదలగా ఉన్నారు.

మనోళ్లు గత సిరీస్ లో భారత్ ను ఎదుర్కొన్న అనుభవం ఉంది. మైదానంలో బరిలోకి దిగినప్పుడు ఇరు జట్ల ఆటగాళ్లలోనూ గత సిరీస్ జ్ఢాపకాలు మదిలో ఉండటం ఖాయం. ఈ సారి మనోళ్లు తగిన రీతిలో బదులిస్తారా లేక దక్షిణాఫ్రికా ఇక్కడా తమ జోరు కొనసాగిస్తుందా చూడాలి. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదు...

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ