ఇమ్రాన్ ఖాన్ ను లేపేస్తే ఆమెకు ఏం వస్తుంది?

November 06, 2015 | 12:00 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Imran_Khan_ex_wife_Reham_try_to_poison_him

పాక్ క్రికెట్ లెజెండ్ ఇమ్రాన్ ఖాన్ పై గతంలో విష ప్రయోగం జరిగిందనే వార్తలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అది చేసిందో ఎవరో కాదు, స్వయానా ఇమ్రాన్ భార్య(మాజీ) రెహమేనట. ఈ విషయాన్ని భారత్ కు చెందిన ఓ ప్రముఖ పత్రిక కథనం ప్రచురించింది. ఇంతకీ ఆయనను భార్యే చంపాలని చూడటం ఏంటీ? దాని ద్వారా ఆమెకు వచ్చే లాభమేంటి?

                         విషయంలోకి వస్తే... క్రికెట్ దిగ్గజంగా కీర్తిపొందిన ఇమ్రాన్ పాకిస్థాన్ రాజకీయాల్లో ప్రస్తుతం ఓ ప్రధాన నేతగా ఉన్నారు. పాకిస్థాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ పేరిట ఓ పార్టీని నెలకొల్పి ప్రతిపక్ష అధినేత హోదాలో కొనసాగుతున్నారు. బ్రిటిష్ పాకిస్థాన్ అయిన రెహం ఓ జర్నలిస్ట్. వారిద్దరు ప్రేమవివాహం చేసుకున్నారు. అయితే ఇమ్రాన్ అడ్డు తొలగితే, ఆయన రాజకీయ వారసత్వం తనకు లభిస్తుందన్న కుట్రతో రెహం ఈ పని చేయబోయిందట. ఈ విషయాన్ని ఆరిఫ్ నిజామీ అనే ఓ పాక్ జర్నలిస్టు వెలుగులోకి తెచ్చాడు. పాక్ కు చెందిన 'న్యూస్ 24' చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలను వివరించాడట. పాక్ భార్య రెహానే ఆయనపై విష ప్రయోగం చేయాలనుకుంది. ఈ విషయాన్ని తొలుత నిఘా వర్గాలు కనుగొన్నాయని అరిఫ్ చెప్పాడు.

"రెహాన్ ప్రవర్తన సరిగ్గా లేదు. ఆమె ఉద్దేశాలు సక్రమంగా లేవు. పార్టీ వారసత్వం కోసం మీకు విషం పెట్టే అవకాశాలు ఉన్నాయి" అని ఇంటెలిజన్స్ వర్గాలు ఖాన్ ను హెచ్చరించాయట. ఇమ్రాన్ గతంలో ఆస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన సమయంలో ఆయన శరీరంలో విష పదార్థం ఉన్నట్టు వైద్యులు గుర్తించారని కూడా తెలిపాడు. ఆ తరువాత వీరిద్దరిలో విభేదాలు పెరిగాయని, ఈ నేపథ్యంలోనే గతేడాది తమ బంధాన్ని తెంచుకున్నట్లు వారు ప్రకటించారని అరీఫ్ వెల్లడించాడు. ఇక వారిద్దరు విడిపోయినందుకు గల కారణాలు ఇవేనని చర్చ జరుగుతోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ