సౌతాఫ్రికాలో వికలాంగ క్రికెటర్ నరబలి

November 17, 2015 | 12:23 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Indian origin cricketer nawaz khan beheaded in South Africa

దక్షిణాఫ్రికాలో భారత సంతతికి చెందిన ఓ మానసిక వికలాంగ క్రికెటర్ నరబలికి గురయ్యాడు. నవాజ్ ఖాన్ (23) అనే భారత సంతతి యువకుడు వికలాంగుడైనా క్రికెట్ లో రాణిస్తున్నాడు. తనదైన శైలిలో రాణిస్తున్న నవాజ్ ఖాన్ 2013 ఏడాదికి సంబంధించి ‘వికలాంగ క్రికెటర్ ఆఫ్ ఇయర్’గా అవార్డు కూడా అందుకున్నాడు. సదరు అవార్డును తన అభిమాన క్రికెటర్ హషీమ్ ఆమ్లా చేతుల మీదుగా అందుకున్న నవాజ్ ఖాన్ తెగ సంబరపడిపోయేవాడట.

ఇక అతగాడిని ప్రాణ స్నేహితుడే అతడిని అడవిలోకి తీసుకెళ్లి అత్యంత దారుణంగా కత్తితో తల నరికి చంపాడు. నవాజ్ ఖాన్ కు తండోవాఖే డుమా(21) అనే క్లోజ్ ఫ్రెండ్ ఉండేవాడు. నాటు వైద్యం చేస్తుండే డుమాకు సమస్యల నుంచి బయటపడాలంటే మనిషి తల తీసుకురావాలని ఓ భూత వైద్యుడు చెప్పాడు. ఈ మేరకు డుమా పక్కాగా పథకం రచించుకున్నాడు. మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి డుమా, నవాజ్ ఖాన్ ను తన ఇంటికి సమీపంలో ఉన్న అడవిలోకి తీసుకువెళ్లాడు. ఆ తర్వాత అక్కడ కత్తితో దాడి చేసి నవాజ్ ఖాన్ ను హత్య చేశాడు.

స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు డుమాను అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా తాను చేసిన ఘాతుకాన్ని ఒప్పుకోవడంతో పాటు ఘటనా స్థలాన్ని డుమా చూపించాడు. ఈ కేసులో నిందితుడితో పాటు మరో ఇద్దరిని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ