ప్రెజర్ తట్టుకోవాలంటే పాక్ ఆ పని చేయాల్సిందే!

August 06, 2015 | 03:26 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Inzamam_ul_Haq_about_india_tour_PCB_niharonline

ఇంజమామ్ ఉల్ హక్ పాకిస్థాన్ మాజీ కెప్టెన్. పాక్ విజయాల్లో తనవంతు కీలక పాత్ర పోషించిన ఈ ఆటగాడు రిటైర్డ్ తర్వాత ఆటకే కాదు, మీడియా కు దూరంగా ఉన్నాడు. అయితే తాజాగా పాకిస్థాన్ భారత్ సిరీస్ లపై అంశం తెరపైకి రావటం, వాటిపై సంగ్దిగ్థత నెలకొనటంతో ఆయన మీడియా ముందుకి వచ్చి మాట్లాడాడు.

పాకిస్థాన్ క్రికెటర్లు ఒత్తిడిలోనూ రాణించాలంటే టీమిండియాతో రెగ్యులర్ గా ఆడాలని సూచించాడు. బాగా రాటుదేలాలంటే భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా పర్యటనలకు వెళ్లాలని సూచిస్తున్నాడు. ఆయా సిరీస్ లో మేము చాలా వరకు విఫలమయ్యాం. కానీ, ఆడటం ఎలాగో నేర్చుకున్నాం. అలాగే ముఖ్యంగా భారత్ తో ఆడటం ద్వారా పురోగతి ఖచ్ఛితంగా ఉంటుంది. అయితే ఎక్కడ ఆడామన్నది ముఖ్యం కాదు. ఎక్కడ ఆడినా అలాంటి ఒత్తిడి పెరిగే జట్లతో ఆడితేనే లాభమని చెబుతున్నాడు. భారత్ తో క్రమం తప్పకుండా ఆడాలి. ఇంతకు మించి ఆటగాళ్లకు నేను చెప్పేది లేదని అన్నాడు. పరిస్థితులు అనుకూలించకున్నా... పీసీబీ ఏదో రకంగా భారత్ తో సిరీస్ లు నిర్వహించేలా ప్రయత్నించాలని, అవసరమైతే తటస్థ వేదికలకు మొగ్గుచూపాలని సూచించాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ