లంక లైట్ తీసుకుంటే వాళ్లు మాత్రం గౌరవించారు

August 05, 2015 | 04:15 PM | 4 Views
ప్రింట్ కామెంట్
Jayawardane_as_ECB_batting_coach_niharonline

సీనియర్ ఆటగాళ్ల పట్ల లంక క్రికెట్ బోర్డు వైఖరి మొదటి నుంచే అస్సలు బాగోద్దన్నది అందరికీ తెలిసిన విషయమే. రిటైర్డ్ అయిన తర్వాత దిగ్గజాల సేవలను వినియోగించుకోకుండా పక్కన పెట్టేయడం వారికి అలవాటే. ఒకానోక సమయంలో మురళీధరన్ లాంటి సీనియర్ ఆటగాళ్లను సైతం లంక లైట్ తీసుకుందంటే వారి నిర్లక్ష్యం ఏపాటిదో అర్థమవుతుంది.  తాజాగా ఇటీవలె రిటైర్డ్ అయిన శ్రీలంక క్రికెటర్ మహేలా జయవర్థనే విషయంలో కూడా బోర్డు ఇదే వైఖరిని అనుసరించింది. ఇటీవల జరిగిన దేశీవాళీ కోచ్ ల జయవర్థనే ను పక్కన బెట్టడం తీవ్ర చర్చకు దారితీసింది.  తన ఆటతో ఎన్నో ఏళ్లుగా శ్రీలంక క్రికెట్ మూల స్తంభంలా నిలిచాడు మహేలా. అయితే, ఈ దిగ్గజం సేవలను లంక గుర్తించకపోయినా ఇంగ్లాండ్ మాత్రం గుర్తించింది. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) మహేలా సేవలను వినియోగించుకునేందుకు ముందుకొచ్చింది. బ్యాటింగ్ సలహాదారుగా నియమించుకునేందుకు అతనితో అంగీకారం ఒప్పందం చేసుకుంది. ఈ విషయాన్ని ఈసీబీ అధికారికంగా ప్రకటించింది. ఇంగ్లాండ్ త్వరలో వరుసగా ఉపఖండ జట్లతో సిరీస్ లు ఆడనుంది. అంతేకాదు వచ్చే ఏడు టీ 20 వరల్డ్ కప్ కూడా ఉపఖండంలోనే జరగనుంది. దీంతో పిచ్ లపై అవగాహన ఉన్న మహేలాను బ్యాటింగ్ కోచ్ గా నియమించుకుంటే మంచిదని ఈసీబీ భావించిందట. ఈ నేపథ్యంలోనే మహేలాకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒక దిగ్గజ ఆటగాడ్ని సొంత దేశం పక్కన బెట్టినా ఇంగ్లాండ్ అతనికి గౌరవం ఇవ్వడం నిజంగా గొప్ప విషయం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ