చిన్నస్వామిలోనూ మ్యాజిక్ షురూ అయ్యిందా?

November 14, 2015 | 12:56 PM | 1 Views
ప్రింట్ కామెంట్
south_africa_2nd_test_chinnaswamy_first_day_niharonline

దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌లో భాగంగా శనివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మొదలైన రెండో టెస్ట్ మ్యాచులో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఆట ఆరంభం నుంచే భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ సఫారీ ఆటగాళ్లను ఇబ్బంది పెట్టారు. భారత స్పిన్నర్ అశ్విన్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి సౌతాఫ్రికాకు షాకిచ్చాడు. ఓపెనర్ వాన్ జైల్, డు ప్లెసిస్ లను పెవిలియన్ కి పంపి సఫారీల నడ్డివిడిచాడు. ఇక లంచ్ అనంతరం మరో రెండు వికెట్లు నేలకూయాయి. ప్రమాదకరంగా మారుతున్న డీన్ ఎల్ గర్ ను జడేజా క్లీన్ బౌల్డ్ చేశాడు. లంచ్ తర్వాత ఇన్నింగ్స్ మరింత నెమ్మదించింది. డివిలియర్స్ 43 పరుగులతో, డుమ్ని 6 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. స్కోర్ ప్రస్తుతం 114-4 గా ఉంది. చూస్తుంటే చిన్నస్వామి స్టేడియంలో కూడా స్పిన్ మాయాజాలం బాగానే వర్కవుట్ అయ్యేలా ఉంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ