సచిన్ కి ఆయనెప్పుడూ స్పెషలే

September 22, 2015 | 01:21 PM | 2 Views
ప్రింట్ కామెంట్
Tendulkar-condolence-to-dalmiya-niharonline.jpg

భారత బ్యాటింగ్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ బీసీసీఐ చీఫ్ జగన్మోహన్ దాల్మియా మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేశారు. దాల్మియా ఓ క్రికెట్ దిగ్గజం. అలాంటి వారు అరుదుగా పుడతారు, ఆయన లేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నా అంటూ బాధతప్త స్వరంతో సచిన్ మాట్లాడాడు. సోమవారం మీడియా తో ఆయన దాల్మియా తో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు.

‘దాల్మియా నాకు ప్రత్యేకమైన మనిషి. నాకే కాదు ఆటగాళ్లందరికీ ఆయన ప్రత్యేకం. ఆటగాళ్ల పట్ల ఆయనకు(దాల్మియా) మక్కువ ఎక్కువ. ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే చాలు వచ్చి పలకరించి ఓదార్చేవారు. మా మధ్య ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు దానివెనుక ఉన్న మొత్తం విషయాన్ని గ్రహించి పరిష్కరించేదాకా దాల్మియా ఊరుకునేవారు కాదు.  ముఖ్యంగా క్రికెట్ బోర్డు స్పానర్ షిప్ ల విషయంలో తలెత్తే సమస్యలను చురుక్కుగా ఆయన పరిష్కరించేవారు. ఒకరకంగా చెప్పాలంటే మన బోర్డు(బీసీసీఐ) ఈరోజు ఇంత ప్రతిష్టాత్మకంగా ఉండటానికి కారణం ఆయనే. ఆటగాళ్ల ఇబ్బందులను పసిగట్టడమే కాదు వారిలోని టాలెంట్ ను ప్రొత్సహించి ముందుకు తీసుకెళ్లడంలో కూడా ఆయన పాత్ర గణనీయమైంది. స్పాన్సర్ల షిప్ కోసం ఆయన వ్యవహారించే తీరు గురించి నేను తరుచూ వినేవాడిని, అది విన్నప్పుడల్లా నాకు అనిపించేది క్రికెట్ పట్ల ఆయనకున్న శ్రద్ధ ఏంటో, నిజంగా ఆయనను చాలా మిస్సవుతున్నా అంటూ ఉద్వేగభరితంగా సచిన్ ప్రసంగించాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ