ప్రోటీస్ దిగ్గజం పూజారిగా మారిన వేళ

May 02, 2016 | 02:59 PM | 1 Views
ప్రింట్ కామెంట్
rhodes-pujari-avatar-niharonline

బంతి మైదానంలో ఏవైపు దూసుకెళ్లినా సరే చిరుతలా చెంగు చెంగున దూకుతూ బంతులను ఓడిసిపట్టంలో జాంటీ రోడ్స్ గురించి తెలియని వారు ఉండరు. ప్రపంచంలోని అత్యుత్తమ ఫీల్డర్ గా, ప్రోటీస్ జట్టుకు ఎన్నో విలువైన ఇన్నింగ్స్ అందించిన ఆటగాడతను. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టుకు కోచింగ్ స్టాఫ్ లో ఒకడిగా సేవలందిస్తున్నాడు. ఎక్కువ రోజులు ఇండియా లోనే గడిపే తనకు ఈ గడ్డ రెండో ఇల్లని, హిందూ మత విశ్వాసాలపై తనకెంతో గౌరవమని తరచూ చెప్పుకుంటాడు కూడా. అలాంటి రోడ్స్, తాజాగా పూజారి అవతారం ఎత్తి దుర్గమ్మకు పూజలు చేశాడు. సంప్రదాయ పంచె కట్టుకుని ముంబయ్ లోని పెజావర్ మఠానికి వచ్చిన ఆయన కనకదుర్గమ్మకు ప్రత్యేకంగా పూజలు చేశాడు. కూతురి కోసం ఈ ప్రత్యేక పూజ నిర్వహించినట్లు చెప్పాడు. ఈ చిత్రాన్ని సామాజిక మాధ్యమ ఖాతా ట్విట్టర్ లో పెట్టగా, వీరేంద్ర సెహ్వాగ్ సహా పలువురు క్రికెటర్లు దీన్ని షేర్, రీట్వీట్ చేస్తున్నారు. జాంటీ రోడ్స్ సంప్రదాయ పూజ చేస్తున్న చిత్రాన్ని మీరూ చూడండి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ