పాక్ కి పీడకల మిగిల్చిన బట్లర్

November 21, 2015 | 12:50 PM | 1 Views
ప్రింట్ కామెంట్
jos_butler_fastest_century_against_pak_niharonline

పాకిస్థాన్ బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించాడు ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్ జాస్ బట్లర్. దుబాయి వేదికగా నిన్న జరిగిన వన్డే మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. కేవలం 46 బంతుల్లోనే సెంచరీ కొట్టిన బట్లర్ పాక్ బౌలర్లను ఆయోమయంలోకి నెట్టేశాడు. తద్వారా రెండోసారి ఇంగ్లండ్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును నమోదు చేసుకున్న బ్యాట్స్ మెన్ గా రికార్డుల్లోకి ఎక్కాడు. బట్లర్ షాట్ లు కొడుతుంటే పాక్ బౌలర్లంతా బిత్తర చూపులు చూస్తూ ఉండిపోయారు. ఈ రికార్డు ద్వారా బట్లర్ మరో ఫీట్ ను సాధించాడు. గతంలో తాను సాధించిన ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును తానే బద్ధలు కొట్టేశాడు.

మొత్తం 52 బంతులను ఎదుర్కొన్న బట్లర్ 8 సిక్సర్లు, 10 ఫోర్లతో ఏకంగా 116 పరుగులు రాబట్టాడు. బట్లర్ వీరవిహారం చేసిన ఈ సెంచరీ... ఇంగ్లండ్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ కాగా, వరల్డ్ క్రికెట్ లో ఆరో ఫాస్టెస్ట్ సెంచరీగా నమోదైంది. అంతకు ముందు 77 బంతుల్లో 129 పరుగులు సాధించాడు. ఆ మ్యాచ్ లో న్యూజిలాండ్ ను ఇంగ్లాండ్ చిత్తు చేసింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ