ఉమెర్ దరాజ్ కు బెయిల్ దొరికింది

February 27, 2016 | 02:17 PM | 1 Views
ప్రింట్ కామెంట్
kohli-Pak-Fan-got-bail-niharonline

ఈ పేరు చెబితే ఎవరికి అర్థం కాదేమో. అదేనండీ... విరాట్ కోహ్లీ పాక్ అభిమానికి ఎట్టకేలకు ఊరట లభించింది. జనవరిలో ఆస్ట్రేలియా, టీమిండియా మధ్య అడిలైడ్ లో జరిగిన టీ20 మ్యాచ్ లో కోహ్లీ 90 పరుగులు చేసి జట్టు విజయానికి దోహదపడ్డాడు. దాంతో తన అభిమాన క్రికెటర్ ఆటకు ముగ్ధుడైన ఉమెర్ పట్టలేని సంతోషంతో తన నివాసంపై భారత జాతీయ జెండాను ఎగుర వేశాడు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు చెప్పడంతో వెంటనే అతన్ని అరెస్టు చేశారు.

                             కేవలం కోహ్లీపై అభిమానంతోనే తానలా భారత జెండా ఎగురవేశానని కోర్టులో విచారణ సందర్భంగా తెలిపాడు. తానేం దేశద్రోహానికి పాల్పడలేదని వివరణ ఇచ్చుకున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 18న బెయిలు కోసం పిటిషన్ పెట్టుకున్నా కోర్టు తిరస్కరించింది. దీంతో అతనికి పదేళ్ల వరకు జైలు శిక్ష పడవచ్చని వదంతులు వచ్చాయి. చివరకు శనివారం ఉమెర్ దరాజ్ కు బెయిలు మంజూరైంది. రూ.50వేల పూచీకత్తు సమర్పించాలని ఆదేశిస్తూ పంజాబ్ ప్రావిన్స్ లోని ఒకారా అడిషనల్ డిస్ట్రిక్ట్, సెషన్స్ కోర్టు బెయిలు మంజూరు చేసింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ