ఐసీసీ చైర్మన్ శ్రీనికి పదవీగండం?

November 02, 2015 | 12:39 PM | 1 Views
ప్రింట్ కామెంట్
ICC-chairman-srinivasan-likely-to-lost-post-BCCI-shashank-manohar-niharonline

బీసీసీఐలో ఏకచత్రాధిపత్యం నడిపి ప్రస్తుతం గడ్డుకాలం ఎదుర్కుంటున్న శ్రీనివాసన్ కు మరోషాక్ తగలనుంది. ఐపీఎల్ లో చెన్నై టీం తరపున అల్లుడు గురునాథ్ మెయెప్పన్ వ్యవహారంతో అప్పటిదాకా ఓ వెలుగు వెలిగిన శ్రీనివాసన్ ప్రతిష్ఠ క్రమంగా మసకబారుతూ వస్తుంది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలతో బీసీసీఐ పగ్గాలను శ్రీని వదులుకోక తప్పలేదు. కనీసం బీసీసీఐ బోర్డు మీటింగుల్లోకి కూడా ప్రవేశం లేని శ్రీని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)లో మాత్రం తన హవా కొనసాగిస్తున్నాడు.

బీసీసీఐలో స్థానం కోల్పోయిన శ్రీని, ఐసీసీ చైర్మన్ గా కొనసాగుతున్నారు. 2014లో రెండేళ్ల పదవీ కాలానికి ఐసీసీ చైర్మన్ గా శ్రీని ఎంపికయ్యారు. అంటే, వచ్చే ఏడాది దాకా ఆయన పదవీ కాలం ఉంది. దీంతో  బీసీసీఐ కొత్త అధ్యక్షుడు శశాంక్ మనోహర్ ఆ పదవిపై కన్నేశారట. శ్రీనివాసన్ ఈ పదవిని ఆయన బీసీసీఐ ప్రతినిధి హోదాలోనే చేజిక్కించుకున్నారు. దీనినే అస్త్రంగా చేసుకుని శ్రీనిని ఐసీసీ నుంచి కూడా బయటకు పంపేందుకు సన్నాహాలు మొదలైనట్లు సమాచారం. ఐసీసీలో తన ప్రతినిధిని మారుస్తూ బీసీసీఐ ఏకగ్రీవ తీర్మానం చేస్తే, శ్రీని ఐసీసీ చైర్మన్ పదవి నుంచి తప్పుకోక తప్పదు. ఈ దిశగా శశాంక్, ఠాకూర్ లు వేగంగా పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఈ నెల 9న జరగనున్న బీసీసీఐ భేటీలో ఈ మేరకు వారు తమ ప్రణాళికను అమలు చేసేందుకు దాదాపుగా సిద్ధమయ్యాయని వినికిడి. ఇదే జరిగితే, క్రికెట్ శకంలో శ్రీని పని అయిపోయినట్లే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ