వీడియోలు లీక్ చేస్తామంటూ బెదిరింపులు

May 14, 2016 | 10:19 AM | 7 Views
ప్రింట్ కామెంట్
Sharjeel-Khan-threat-calls-niharonline

ఇటీవలి కాలంలో తన అద్భుత ప్రతిభతో రాణిస్తూ పలువురి మన్ననలు పొందిన పాక్ క్రికెట్ జట్టు ఓపెనర్ షార్జీల్ ఖాన్ వేధింపులు గురవుతున్నాడంట. 26 ఏళ్ల షార్జీల్ 11 వన్డేలు, 11 టీ-20 మ్యాచ్ లను పాక్ తరఫున ఆడాడు. గత కొద్దికాలంగా గుర్తు తెలియని వ్యక్తుల నుంచి తనకు బెదరింపు కాల్స్ వస్తున్నాయని షార్జీల్ ఆరోపిస్తున్నాడు. రూ. 2 లక్షలు ఇవ్వాలని వారు బెదిరిస్తున్నారని, ఇవ్వకుంటే, తన పరువు తీసే వీడియోలను బహిర్గతం చేస్తామని అంటున్నారని తన ఫేస్ బుక్ ఖాతాలో ఉంచిన వీడియోలో వాపోయాడు.

                            తాను ప్రస్తుతం కేవలం ఒకటే చెప్పదలచుకున్నానని, ఒకవేళ తన గురించి ఏవైనా దృశ్యాలు బయటకు వస్తే, అభిమానులు వాటిని నమ్మరాదని, ఆ వీడియోలో ఉన్నది తాను కాదని చెప్పాడు. డబ్బు చెల్లించడం ఒక్కో రోజు ఆలస్యమయ్యే కొద్దీ రోజుకు రూ. లక్ష పెంచుతామని బెదిరిస్తున్నారని తెలిపాడు. కాగా, ఈ విషయంలో తమకు అధికారిక ఫిర్యాదు ఇంతవరకూ అందలేదని, షార్జీల్ ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తామని ఆయన నివసిస్తున్న హైదరాబాద్ పట్టణ పోలీసులు తెలిపారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ