యువ రక్తం కోసం పీసీబీ నయా ఐడియా

August 04, 2015 | 04:50 PM | 1 Views
ప్రింట్ కామెంట్
PCB_shaharyar_khan_talent_hunt_niharonline

కొత్త టాలెంట్ అన్వేషణ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఓ నయా ఆలోచన చేసింది. నిత్యం వివాదాలతో సతమతమవుతున్న బోర్డు వ్యవహారంలో రాజకీయ కోణాలు కూడా తక్కువేమీ కాదు. అలాంటి టైంలో ఆటగాళ్లలో ప్రతిభావంతులను తొక్కి పారేస్తున్నారన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. వీటికి అధికారులు కూడా ఇచ్చే సంజాయిషీలు సహేతుకంగా ఉండవు. ఈ నేపథ్యంలో పీసీబీ తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారడంతోపాటు అభినందనలు కూడా వెలువెత్తుతున్నాయి. వివాదాస్పదమయినప్పటికీ ఆ దేశంలో ప్రతిభావంతులకు కొదవలేదు. దీంతో ఓ ప్రణాళిక రచించింది పాక్ బోర్డు. త్వరలో ఆటగాళ్ల కోసం ఓ ప్రత్యేక వెబ్ సైట్ ప్రారంభిస్తుందట. దేశంలో ఎవరైనాగానీ తమలో క్రికెట్ సత్తా ఉందని భావిస్తే, తమ బ్యాటింగ్, బౌలింగ్ లను రికార్డు చేసి, వ్యక్తిగత వివరాలు పొందుపరచి, ఆ వీడియోను సదరు వెబ్ సైట్లో పోస్టు చేయాలి. ఆ వీడియోలను నేషనల్ క్రికెట్ అకాడమీ కోచ్ లు పరిశీలించి, భవిష్యత్తులో సత్తా చాటగలరన్న ఆటగాళ్లకు అకాడమీ ఎంపిక చేస్తారట. అక్కడ మరోసారి పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారట. ప్రతిభను తొక్కిపారేస్తున్నారన్న ఆరోపణలకు చెక్ పెట్టే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు చైర్మన్ షహర్యార్ ఖాన్ మీడియాకు తెలిపారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ