పైకి బిల్డప్ లు ఇస్తున్నా... టెన్షన్ లో పాక్

August 03, 2015 | 12:57 PM | 1 Views
ప్రింట్ కామెంట్
BCCI_says_no_to_Pakistan_Cricket_Board_niharonline

పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు బీసీసీఐ పెద్ద షాక్ ను ఇచ్చింది.  భారత్ తో సిరీస్ ఆడితే భారీ ఎత్తున ఆదాయం వస్తుందన్న పాక్ ఆశలకు భారత్ బోర్డు తీసుకున్న నిర్ణయంతో మింగుడు పడటం లేదు. ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో పాకిస్థాన్ తో ప్రస్తుతం సిరీస్ ఆడే ఆలోచన నుంచి విరమించుకున్నట్లు భారత్ తెలిపింది. దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కంగుతింది. ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న  పాక్ బోర్డు... తమతో  సిరీస్ ఆడాల్సిందిగా భారత్ ను ఆ మధ్య కోరింది. దీనిపై భారత్ సానుకూలంగా స్పందించింది. దీంతో పీసీబీ కి వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లయ్యింది. అంతేకాదు అందుకు సంబంధించి షెడ్యూల్ ను కూడా సిద్ధం చేసుకుంటుంది. హఠాత్తుగా ఇటీవల పంజాబ్ లో ఉగ్ర దాడులు కావటంతో మళ్లీ సమస్య మొదటికొచ్చింది. ఈ తాజా పరిణామాలతో బీసీసీఐ మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. అయితే నిర్ణయాన్ని మాత్రం ఇంకా అధికారంగా ప్రకటించాల్సి ఉంది. ఈ విషయమై పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ మాట్లాడుతూ... భారత్ పునరాలోచన చేస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ బీసీసీఐ ఒప్పుకోకపోతే... ప్రత్యామ్నాయంగా మరో దేశంతో సిరీస్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నామని పాక్ ఆయన తెలిపారు. అయితే లోటు బడ్జెట్ లో ఉన్న పాక్ గట్టెక్కాలంటే భారత్ తో సిరీస్ కంపల్సరీ. ఇండియాతో ఆడితేనే తప్ప... పాక్ బోర్డుకు కాసుల వర్షం కురవదు. దీంతో పైకి గంభీరాలు పలికిన లోపల కాస్త ఆందోళనలోనే ఉన్నట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ