హమ్మయ్యా... లంక గడ్డపై భారత్ జయకేతనం

September 01, 2015 | 04:33 PM | 1 Views
ప్రింట్ కామెంట్
team-india-victory-in-third-test-against-srilanka-and-series-niharonline.jpg

22 ఏళ్ల నిరీక్షణ ఫలించింది. ఎట్టకేలకు లంక గడ్డపై కోహ్లీ సేన జయబావుటా ఎగరేసింది. కెప్టెన్ మాథ్యూస్ సెంచరీతో కంగారు పెట్టినా... ఆఖర్లో ఇషాంత్ దెబ్బకు పెవిలియన్ చేరగా, అశ్విన్ టపా టపా వికెట్లు రాల్చి మ్యాచ్ ను త్వరగా కానిచ్చేశారు. దీంతో సిరీస్ 2-1 తో భారత్ వశమైంది. సెంచరీ హీరో ఛటేశ్వర పుజారాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, అశ్విన్ కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కాయి. 386 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన లంకకు కెప్టెన్ మాథ్యూస్ (110), పెరీరా(70) పోరాడినా శ్రమ దక్కలేదు. దీంతో 286 పరుగులకు లంక ఆలౌటయ్యింది. భారత బౌలర్లలో అశ్విన్ 4, ఇషాంత్ 3, ఉమేశ్ 2 వికెట్లు తీశారు. ఇక మ్యాచ్ లో భారత్ తొలి ఇన్నింగ్స్ లో 312, లంక 201 పరుగులు చేయగా, ఇండియా రెండో ఇన్నింగ్స్ లో 274 పరుగులు చేసింది. మొదటి టెస్ట్ లంక గెల్వగా, రెండో టెస్ట్ భారత్ గెలిచింది. ఇక సిరీస్ విక్టరీతో గ్రాండ్ గా సంగక్కరకి వీడ్కోలు చెబుదామనుకున్న లంక ఆశలను భారత్ ఆవిరి చేసినట్లయ్యింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ