రహానే, అశ్విన్ ఆటతో గౌరవప్రదమైన స్కోర్

December 04, 2015 | 12:05 PM | 1 Views
ప్రింట్ కామెంట్
ashwin-rahane-delhi-test-south-africa-niharonline

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో ఇప్పటి దాకా బంతితో మాయాజాలం చేసిన అశ్విన్... ఢిల్లీలో జరుగుతున్న చివరి టెస్ట్ లో బ్యాట్ కు పని కల్పించాడు. ఎంతో ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేసిన అశ్విన్ అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. 116 బంతులను ఎదుర్కొన్న అశ్విన్ 6 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో హాఫ్ సెంచరీ చేశాడు. అంతేకాదు, లాంగ్ ఆన్ మీద కొట్టిన సిక్స్ తో అతను ఈ ఫీట్ సాధించాడు. ఇక 4 టెస్టుల సిరీస్ లో తొమ్మిది ఇన్నింగ్స్ ల తరువాత తొలిసారిగా శతకం నమోదైంది.  అజింక్య రహానే 100 పరుగుల మైలురాయిని అందుకున్నాడు.

                ఓవర్ నైట్ స్కోరు 231/7 వద్ద ఈ ఉదయం బ్యాటింగ్ కొనసాగించిన జట్టులో రహానే, ఆశ్విన్ లు జాగ్రత్తగా ఆడుతూ స్కోరును ముందుకు నడిపించారు. ఈ క్రమంలో 180 బంతులాడిన రహానే 10 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. మరోవైపు రహానే 127 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. ప్రస్తుతం అశ్విన్ (53), ఉమేష్ యాదవ్ (5) క్రీజులో ఉన్నారు. టీమిండియా స్కోరు 8 వికెట్ల నష్టానికి 326 పరుగులు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ