సీనియర్ల విమర్శలను లైట్ తీసుకుంది

September 14, 2015 | 01:16 PM | 1 Views
ప్రింట్ కామెంట్
ravi-shastri-as-team-director-till-2016-t20-worldcup-niharonline

మాజీ స్టార్ ఆటగాడు, భారత క్రికెట్ జట్టు డైరక్టర్ రవిశాస్త్రి పై ఈ మధ్య వస్తున్న విమర్శల గురించి తెలిసిందే. ముఖ్యంగా కోహ్లీతో కలిసి తీసుకునే దుందుడుకు నిర్ణయాల వల్ల టీం కు లాభాల కంటే నష్టాలు ఎక్కువని సీనియర్లు సైతం విరుచుపడ్డారు. మైదానంలో ఆటగాళ్లను ప్రత్యర్థి ఆటగాళ్లపై ఉసిగొల్పటం లాంటివి చెయ్యటం వల్ల క్రమశిక్షణ రాహిత్యంగా జట్టు తయారవుతందన్నదే వారి అభిప్రాయం. ఈ పరిస్థితుల్లో మేనేజర్ గా రవిని కొనసాగిస్తే ప్రమాదకరమని వారు బీసీసీఐకి సూచించారు. అయితే వారి నిర్ణయాన్ని బీసీసీఐ అంతగా పట్టించుకోనట్లు కనిపిస్తోంది.

అయితే వరల్డ్ కప్ లో సెమీస్ కు చేరుకోవటం, ఇటీవల శ్రీలంక సిరీస్ లు గెలవటం వెనుక రవిశాస్త్రి కృషి ఉందని బీసీసీఐ నమ్ముతుంది. అందుకే అతనితో అగ్రిమెంట్ ను మరికొంత కాలం పొడిగించాలని బోర్డు నిర్ణయించింది. ఇందులో భాగంగా 2016 టీ 20 వరల్డ్ కప్ వరకు అతనే టీం డైరక్టర్ గా కొనసాగించాలని నిర్ణయించిందట. ఇందుకోసం బీసీసీఐ అనుమతి పత్రాలను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వీరితోపాటు మరికొందరి పదవీకాలాన్ని కూడా పొడిగించాలని బోర్డు డిసైడ్ అయ్యిందట. విమర్శలు వచ్చినా విజయాలను పరిగణనలోకి రవినే కొనసాగించాలని బీసీసీఐ అభిప్రాయపడుతోందని సమాచారం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ