సెంచరీతో ఆదుకున్న రాయుడు... లక్ష్యం 256

July 10, 2015 | 05:09 PM | 2 Views
ప్రింట్ కామెంట్
Rayudu_Binny_zimbambe_1st_ODI_niharonline

బంగ్లా సిరీస్ సీన్ రిపీట్ అవుద్దో అన్న టెన్షన్ లో తెలుగు తేజం టీమిండియాను ఆదుకుంది. శుక్రవారం జింబాంబ్వే తో జరుగుతున్న మ్యాచ్ లో ఓవైపు టపటపా వికెట్లు రాలుతుంటే... సెంచరీతో కదం తొక్కి గౌరవప్రదమైన స్కోర్ 255 సాధించేందుకు తొడ్పడ్డాడు. సహచరులు సహకరించకున్నా ఒంటరిగా రాణించి 124 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. రాయుడికి తోడు మరో బ్యాట్స్ మెన్ బిన్ని (77) తో రాణించాడు. ఓ దశలో టీమిండియా 87 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీం ను వీరిద్దరు ఆదుకున్నారు. వీరిద్దరిలో ఏ ఒక్కరూ అవుటైనా పరిస్థితి మరి దారణంగా ఉండేది. వీరిద్దరు కలిసి 160 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. కెప్టెన్ రహానే 34 మినహా మిగతా వారెవ్వరూ రాణించలేదు. జింబాబ్వే బౌలర్లలో ఛిబాబా, టిరిపానో రెండేసి వికెట్లు తీయగా, వెటోరి ఒక వికెట్ తీశారు.  

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ