మాస్టర్ ఆత్మకథ ఇప్పుడు మనదగ్గర కూడా...

July 09, 2015 | 05:40 PM | 1 Views
ప్రింట్ కామెంట్
sachin_its_my_way_auto_bio_graphy_in_telugu_niharonline

క్రికెట్ రికార్డులను తిరగరాసిన దేవుడు, ప్రపంచ దేశాల్లో పిచ్చ క్రేజ్ ను మూటగట్టుకున్న యోధుడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. అలాంటి దిగ్గజం ఆత్మకథ ప్లేయింగ్ ఇట్ మై వే త్వరలో తెలుగులోకి కూడా అందుబాటులోకి రానుందట. ఇప్పటికే పలు ప్రాంతీయ భాషల్లోకి తర్జుమా అయిన సచిన్ ఆత్మకథను తెలుగులో ప్రముఖ రచయిత్రి హేమలత అనువదించారు. 450 పేజీల ఈ పుస్తకం ధరను రూ.495గా నిర్ణయించారు. అన్ని ప్రముఖ షాపుల్లో ఈ పుస్తకం త్వరలో అందుబాటులోకి రానుందట. అన్నట్లు ఇప్పటిదాకా దేశ చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో ఓ వ్యక్తి ఆత్మకథ పుస్తకం రికార్డు స్థాయిలో అమ్ముడు పోవటం ఆయనకే సొంతమైందట. రికార్డు స్థాయలో రెండు రోజుల్లో 2లక్షల కాపీలు అమ్ముడు పోయి ప్రభంజనం సృష్టించింది. మైదానంలోనే కాదు ఇలా పుస్తకాల అమ్ముడు విషయంలో కూడా సచిన్ మాస్టరే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ