కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించిన రోహిత్ శర్మ

December 14, 2015 | 11:26 AM | 1 Views
ప్రింట్ కామెంట్
rohit-sharma-ritika-wedding-niharonline

స్టార్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించాడు. స్నేహితురాలితో ఒకటై తన బ్యాచిలర్ లైఫ్ ని ముగించాడు. తన ఎండార్స్ మెంట్ వ్యవహారాలను చూసే రితిక సజ్దేను అతడు ఆదివారం పెళ్లి చేసుకున్నాడు. ముంబైలోని తాజ్ ల్యాండ్ హోటల్ లో వేడుకగా జరిగిన ఈ వివాహానికి క్రీడా, వ్యాపార రంగ ప్రముఖులు క్యూ కట్టారు. పలువురు భారత క్రికెటర్లు, సినీ తారలతో పాటు రోహిత్ మిత్రులు, సన్నిహితులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సచిన్ టెండూల్కర్, అజింక్య రహానే, శిఖర్ ధావన్, ఛటేశ్వర్  పుజారా, రవీంద్ర జడేజా, ఉమేశ్ యాదవ్, సురేశ్ రైనా తదితరులు పెళ్లికి వచ్చారు.

పెళ్లికి రెండు రోజుల ముందు శుక్రవారం రాత్రి రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తమ ముంబై జట్టు కెప్టెన్ అయిన రోహిత్ శర్మ దంపతుల కోసం ప్రత్యేకంగా ఇచ్చిన పార్టీకి కూడా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ప్రస్తుతం బెంగళూరులో విజయ్ హాజరే ట్రోఫీ ఆడుతున్న టీమిండియా వన్డే జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రోహిత్ వివాహానికి హాజరుకాలేకపోయాడు. అయితే యువరాజ్, సురేశ్ రైనా లు మాత్రం మ్యాచ్‌లకు విరామం ఇచ్చి సహచరుడి వివాహ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ