యాషెస్ లో ఆసీస్ 60కే ఆలౌట్

August 06, 2015 | 05:45 PM | 2 Views
ప్రింట్ కామెంట్
stuart_broad_ashes_australia_8_wickets_fourth_test_niharonline

125 ఏళ్ల చరిత్ర కలిగిన యాషెస్ సిరీస్ లో  ఎన్నడూ ఎరగని రీతిలో ఘోర పరాభవం దిశగా ఆస్ట్రేలియా సాగుతుంది. ఇంగ్లాండ్ బౌలర్ సువర్ట్ బ్రాడ్ దాటికి ఆసీస్ కుదేలయిపోయింది. సిరీస్ ను సమం చెయ్యాలంటే గెలవాల్సిన మ్యాచ్ లో ఆస్ట్రేలియాను చావుదెబ్బతీశాడు. బౌలింగ్ లో రెచ్చిపోయిన బ్రాడ్ 9.3 ఓవర్లలో 5 మెయిడెన్ ఓవర్లతో సహా 15 పరుగులు ఇచ్చి 8 వికెట్లు తీశాడు. దీంతో కేవలం 18.3 ఓవర్లలో 60 పరుగులకే ఆలౌటయ్యింది. మూడో టెస్ట్ లో దారుణంగా ఓటమి పాలైన ఆస్ట్రేలియాకు ఈ విజయం ఖచ్ఛితంగా అవసరం. కానీ, బ్రాడ్ వారి ఆశలపై నీళ్లు చల్లాడు. ఆసీస్ పతనాన్ని శాసించాడు. యాషెస్ లో ఈ రేంజ్ లో విఫలమవ్వటం ఆసీస్ కు ఇదే తొలిసారి. పది మంది ప్లేయర్లో తొమ్మిది మంది సింగిల్ డిజిట్ కే అవుట్ కావటం గమనార్హం. ఎనిమిది వికెట్లు తీసిన బ్రాడ్ 300 వికెట్లు తీసిన క్లబ్ లో చేరిపోయాడు. ఈ ఘనత సాధించిన ఇంగ్లాండ్ ఐదో బౌలర్. ఇఫ్పటిదాకా 83 టెస్ట్ లు ఆడిన బ్రాండ్ మొత్తం 307 వికెట్లు తీశాడు.  ఇక అత్యధిక స్కోర్ లో మిచెల్ జాన్సన్ (13) టాప్. ఎక్స్ ట్రాల రూపంలో వచ్చినవి 14. బ్రాడ్  ఇప్పటికే సీరిస్ 2-1 గా ఇంగ్లాండ్ కు ఫేవర్ గా ఉంది. ఈ టెస్ట్ కూడా ఓడిపోతే మరో మ్యాచ్ ఉండగానే ఆసీస్ ఇంగ్లాండ్ కు దాసోహమైనట్టే.   

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ