సురేశ్ రైనా... మరి అంత ఛీపా?

November 10, 2015 | 12:50 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Suresh-raina-demoted-to-B-grade-BCCI-list

భారత యువకెరటం, స్టార్ బ్యాట్స్ మెన్ సరేశ్ రైనాకు సాలిడ్ షాక్ తగిలింది. బీసీసీఐ ప్రతియేడు ప్రకటించే వార్షిక కాంట్రాక్టుల జాబితాలో రైనాకు కొలుకోలేని దెబ్బ పడింది. తాజాగా బోర్డు 2015-16కు గానూ జాబితాను ప్రకటించింది. ఇందులో టీమిండియా ప్లేయర్ రైనాను బీగ్రేడ్ జాబితాలో ప్రకటించింది. గ్రేడ్ –ఏ లో ఉన్న రైనాను వరుస వైఫల్యాలతో సతమతమవుతుండటమే బీ గ్రేడ్ కి పడదోసింది. ఇక రైనాతో పాటు భువనేశ్వర్‌ను కూడా గ్రేడ్-ఎ నుంచి తప్పించింది. దీంతో ఏటా వీరి రెమ్యునరేషన్ కొటి నుంచి 50లక్షలకు దిగజారింది.

మరో వైపు అన్ని ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తున్న ‘బీ’ గ్రేడ్ కాంట్రాక్టులో ఉన్న అజింక్య రహానేకు ప్రమోషన్ ఇచ్చి ఏ గ్రేడును కట్టబెట్టారు. ఏ గ్రేడ్ ఆటగాడిగా రహానేకు బీసీసీఐ ఏడాదికి కోటి రూపాయల వేతనం ఇవ్వనుంది. అయితే ఏ గ్రేడు కాంట్రాక్టులో టీట్వంటీ, వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, టీమిండియా స్పిన్ తురుపుముక్క రవిచంద్రన్ అశ్విన్, సఫారీలతో సిరీస్ లో ఆకట్టుకున్న అజింక్యా రహానేలకు మాత్రమే బీసీసీఐ చోటు కల్పించడం విశేషం. ఈ ఏడాది వరుస వన్డే సిరీస్ ఓటములతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కెప్టెన్ ధోనీ తన గ్రేడ్-ఎ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు.

అయితే సీనియర్ ఆటగాడిగా జాబితాలో తన పేరును ఎప్పటినుంచో పదిలపరుచుకుంటూ వస్తున్న రైనాకు ఈ ఫలితం కొలుకోలేనిదే. ఫామ్ లో లేకపోతే అంతేమరీ.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ