కోచ్ గా జడేజా చిచ్చు పెడుతున్నాడు

October 01, 2015 | 02:03 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Ajay-Jadeja-delhi-cricket-board-coach-clash-niharonline

ఒకప్పుడు ఆల్ రౌండర్ గా వెలుగు వెలిగి, ప్రస్తుత కాలంలో అంతర్జాతీయ క్రికెట్ ఫీల్డ్ కి దూరమైన వ్యక్తి అజయ్ జడేజా. అయితే కాలం కలిసి రావటంతోపాటు బోర్డులో ఆ మధ్య జరిగిన కీలక మార్పులతో ఢిల్లీ టీంకు చీఫ్ కోచ్ గా బాధ్యతలు స్వీకరించాడు. ఇక ఇప్పుడు అక్కడి కీలక పరిమాణాలకు కారకుడవుతూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఎన్నో భారత విజయాల్లో కీలక వ్యక్తిగా నిలిచిన జడేజా అసలు ఢిల్లీ బోర్డులో ఏం చిచ్చుపెడుతున్నాడు.

సోమవారం ఉదయం ప్రాక్టీస్ చేస్తుండగా సడన్ గా మైదానం వదిలి వెళ్లిపోయాడు అజయ్ జడేజా. తన కుమారుడికి ఆరోగ్యం బాగా లేకపోవటంతోనే ప్రాక్టీస్ సెషన్ ను వదిలి వెళ్లానని జడేజా చెప్పాడు. అయితే అసలు కారణం వేరే ఉందని తెలుస్తోంది. అమిత్ బండారి ని అసిస్టెంట్ కోచ్ గా ఢిల్లీ బోర్డు నియమించింది. ఇది జడేజాకు ఏ మాత్రం ఇష్టం లేదు. అందుకే మైదానం వదిలి వెళ్లాడని తెలుస్తోంది. అంతేకాదు ఇద్దరు కోచ్ లను నియమించడం వల్ల టీంపై పట్టు ఉండదని జడేజా భావిస్తున్నాడట. అందుకే అలక బూని మైదానం విడిచాడని సమాచారం. అయితే దీనిపై బోర్డు వేరేలా స్పందిస్తుంది. జడేజా కుమారుడికి బాగా లేదనే వదిలి వెళ్లాడని, ఒకవేళ బండారి విషయమే అందుకు కారణమని అనుకోవటం లేదని బోర్డు ప్రెసిడెంట్ ప్రకాశ్ బన్సాల్ చెబుతున్నాడు. అజయ్ జడేజా టీంకు ప్రధాన కోచ్. ఆయన ఏది చెబితే అదే కరెక్ట్. అవసరమనుకుంటే బండారిని తొలగిస్తామని పేర్కొన్నాడు. అయితే బోర్డులో ఉన్న మిగతా వారు మాత్రం వేరుగా చెబుతున్నారు. జడేజా మైదానం ఎందుకు వదిలి వెళ్లాడో సరైన కారణం చెప్పకపోతే ఆయన్ను తొలగించి ఆ స్థానే విజయ్ దహియా ను నియమిస్తామని వారంటున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ