ధోనీకి స్విమ్మింగ్ పూల్ దెబ్బ

April 23, 2016 | 01:03 PM | 1 Views
ప్రింట్ కామెంట్
dhoni-wasre-15k-liters-swimming-pool-niharonline

భారత జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి బ్యాడ్ టైం నడుస్తోంది. టీ20 నుంచి ఖాళీ చేతులతో వెనుదిరిగాడు. ఇప్పుడు అతని నాయకత్వంలోని పూణే వరుస ఓటమిలతో ముందుకెళ్తుంది. అసలు టైం  కలిసి రాలేదు అనే బదులు సమస్యల్లోకి నెట్టేసింది అని చెబితే సరిగ్గా సరిపోతుంది. మొన్నటిదాకా అమ్రపాలి రియల్ ఎస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగిన అతడు సోషల్ మీడియా కారణంగా ఆ పదవి నుంచి తప్పుకుని పెద్ద ఆదాయాన్నే కోల్పోయాడు. తాజాగా స్వంత ఊరు రాంచీలో ఓ పెద్ద వార్త కలకలం రేపుతోంది.

               దేశమంతా ప్రస్తుతం తీవ్రమైన నీటి ఎద్దడి ఉంది. తాగు నీటి దొరక్క ప్రజలంతా అల్లలాడుతున్నారు. అయితే రాంచీలోని తన ఇంటిలోని స్విమ్మింగ్ పూల్ కోసం ధోనీ రోజుకు 15 వేల లీటర్ల నీటిని వాడేస్తున్నాడట. ఈ మేరకు అతడి ఇరుగు పొరుగు స్థానికులు తీవ్ర ఆరోపణలు చేసినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి వీటికి ధోనీ రియాక్షన్ ఇస్తాడా ఇవ్వడా చూద్దాం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ