అంతర్జాతీయ క్రికెట్ నుంచి యాసిర్ ను సస్పెండ్ చేస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వెల్లడించింది. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు ఇటీవల డోపింగ్ టెస్టులో తేలడంతో పాకిస్థాన్ స్పిన్నర్ యాసిర్ షాపై వేటు పడింది. క్లోర్ టేలిడాన్ అనే మాత్రను యాసిర్ తీసుకున్నట్లు తేలిందని, యాంటీ డోపింగ్ కోడ్ కు ఇది విరుద్ధమని, అందుకే అతన్ని సస్పెండ్ చేస్తున్నామని ఐసీసీ పేర్కొంది. కాగా, యాసిర్ ను ఎంతకాలం సస్పెండ్ చేశారనే విషయంపై ఐసీసీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.