గత వారం శ్రీలంకపై సిరీస్ నెగ్గిన ఆనందంలో పాక్ ఆటగాడు షోయబ్ మాలిక్, సానియా మీర్జా డ్యాన్స్ చేసి ఎంజాయ్ చేశారు. పాక్ జట్టు సభ్యులు కూడా వారికి జత కలిశారు. ఆ వీడియోను ట్విట్టర్‌లో పెట్టి ‘షోయబ్ మాలిక్‌తో విజయోత్సవ సంబరాలు’ అని సానియా ట్వీట్ చేసింది. దీంతో క్రికెటర్ల మధ్య ‘డ్యాన్స్ వార్’ మొదలైంది. మైకేల్ జాక్సన్ ‘మూన్ వాక్’ స్టెప్పులేసి దీటుగా తొడగొట్టాడు. మైదానంలోకి రావడం కాదు.. ఎప్పుడూ అక్కడే ఉంటామంటూ రీట్వీట్ చేశాడు. దీనిపై క్రికెటర్ యువరాజ్ సింగ్ స్పందించాడు. ‘అద్భుతమైన ఆటగాళ్లు..! కానీ భయానకమైన డ్యాన్సర్లు’ అని ట్వీట్ చేశాడు. ప్రతిగా ‘మైదానంలోకి రా (ఆజావ్ మైదాన్‌మే)’ అంటూ షోయబ్ రీట్వీట్ చేశాడు. మాలిక్ చాలెంజ్‌ను స్వీకరించిన యువీ.. గట్టి కౌంటర్ ఇచ్చాడు. మైకేల్ జాక్సన్ ‘బిల్లీ జీన్’కు మూన్‌వాక్ స్టెప్పులేసి తానేం తక్కువకాదని నిరూపించాడు. ఆ వీడియోను అప్‌లోడ్ చేసి ‘సోదరా.. మేం ఎప్పుడూ మైదానంలోనే ఉంటాం’ (భాయ్ హమ్‌తో హమేషా మైదాన్‌మే థే) అంటూ సరదాగా జవాబిచ్చాడు.