డాన్స్ రాకపోయినా ఝలకిచ్చేందుకు రెడీ అయ్యాడు

July 27, 2015 | 05:27 PM | 2 Views
ప్రింట్ కామెంట్
Irfan_Pathan_Jhalak_Dikhh_laJaa_Reloaded_niharonline

ఇర్ఫాన్‌ పఠాన్‌ క్రికెట్ ప్రపంచంలో లో ఒకానోక సమయంలో ఆల్ రౌండర్ గా చెలామయ్యాడు. ఆ తర్వాత టైం బాగోక జట్టుకు దూరమై ప్రస్తుతం దాదాపు క్రీడాభిమానులు మరిచిపోయే స్టేజీకి చేరుకున్నాడు. ఈ మధ్య అప్పుడప్పుడు దేశీవాళీ టోర్నీలలో రాణిస్తున్నప్పటికీ సెలక్టర్ల దృష్టిలో మాత్రం పడలేకపోయాడు. కానీ అప్పుడప్పుడు టీవీ షోల్లో కనిపిస్తున్నాడు. అయితే తాజాగా పూర్తి స్థాయిలో ఓ రియాల్టి షో నటించేందుకు అంగీకరించాడట ఇర్ఫాన్. కలర్స్‌ చానెల్‌లో ప్రసారమయ్యే సెలబ్రిటీ డ్యాన్స్‌ ‘జలక్‌ దిక్ లాజా రీలోడెడ్‌’లో ఇర్ఫాన్‌ పఠాన్‌ వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ షో ద్వారా ఆర్జించే మొత్తాన్ని తన క్రికెట్‌ ఫౌండేషన్‌ ‘క్రికెట్‌ అకాడమీ ఆఫ్‌ పఠాన్స్‌’కు విరాళంగా ఇవ్వనున్నట్లు తెలిపాడు. పేద బాలల క్రికెట్‌ శిక్షణ కోసం ఈ అకాడమీని యూసుఫ్‌ పఠాన్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌లు కలసి స్థాపించారు. ‘నా దగ్గరకు వచ్చిన ఆఫర్‌ను ఓ సవాలుగా స్వీకరించా. వాస్తవంగా నాకు డ్యాన్స్‌ రాదు. కానీ నాన్‌ డ్యాన్సర్ల కోసమే ఈ షో ఏర్పాటు కావడంతో కొంత ఆలోచించి సరేనన్నాన’ని ఇర్ఫాన్‌ చెప్పాడు. అంటే డాన్స్ రాకపోయినా మనోడు రెడీ అవుతున్నాడు ఏం జరుగుద్దో ఏంటో!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ