మధ్యలో ఐసీసీ ఏంటటా?... అది మన ఇష్టం

August 27, 2015 | 12:51 PM | 1 Views
ప్రింట్ కామెంట్
abbas_zahri_ICC_president_indo_pak_series_niharonline.jpg

సిరీస్ నిర్వహించడం ద్వారా కాస్తలో కాస్తైన ఇరు దేశాల మధ్య సంబంధాలను బలపర్చవచ్చని ఆశలు ఆవిరి అయ్యేలాగానే ఉన్నాయి. ఓవైపు సిరీస్ అంటూ ఆహ్వనిస్తూ ఉగ్ర చర్యలకు దిగటంతో కాలిన భారత్ పాక్ తో సిరీస్ లకు పుల్ స్టాప్ పెట్టాలన్న యోచనలో ఉంది. దీంతో ఆర్థిక లోటుతో కొట్టుమిట్టాడుతున్న పాక్ బోర్డుకు మరింత దిగులు పట్టుకుంది. దీంతో పెద్ద దిక్కయిన ఐసీసీని ఆశ్రయించింది. పాక్ లో కాకపోయినా దుబాయ్ వంటి తటస్థ వేదికలో భారత్ తమతో సిరీస్ ఆడేలా ఎలాగైనా రికమండ్ చెయ్యాలని  అంతర్జాతీయ క్రీడా మండలిని పీసీబీ కోరింది. అయితే దీనికి ఐసీసీ నో చెప్పేసింది. ఆడాలో? వద్దో? ఆయా బోర్డులే నిర్ణయించుకోవాలి గానీ మధ్యలో కలుగ జేసుకునేందుకు మేమేవరం అంటూ ఐసీసీ ఛైర్మన్ జహీర్ అబ్బాస్ స్పష్టం చేశారు. ద్వైపాక్షిక సిరీస్ ఆడాలని భారత్‌ను ఐసీసీ ఒత్తిడి చేసే ప్రసక్తే లేదని అబ్బాస్ పాక్ కి తేల్చి చెప్పేశారు.

అసలు దౌత్య, రాజకీయ పరమైన సమస్యలు పరిష్కారం కాకుండా, సరిహద్దుల్లో పాక్ టెర్రరిస్టులు కవ్వింపు చర్యలకు దిగుతుంటే క్రికెట్ ఎలా ఆడతామని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆట కన్నా ఆటగాళ్ల భద్రతే మాకు ముఖ్యమని ఇదివరకే ఆయన పీసీబీకి  స్పష్టం చేశారు కూడా. ఇదిలా ఉండగానే.. భారత్-పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ నవంబరులో జరిగే అవకాశం ఉందంటూ పీసీబీ ఛైర్మన్ షహర్యార్ ఖాన్ ఆశాభావం వ్యక్తం చేయడం కొసమెరుపు. అయినా పాక్ పిచ్చి కాకపోతేనూ ఐసీసీ చెప్పినంతా మాత్రానా మనం ఆడతామా ఏంటీ?

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ