సంగక్కరకు అరుదైన గౌరవం

August 25, 2015 | 05:36 PM | 1 Views
ప్రింట్ కామెంట్
sangakkara_appointed_as_srilanka_high_commissioner_niharonline

క్రికెట్ లో ఎంత మంది ఆటగాళ్లు వచ్చినా స్పెషలిస్ట్ లు గా పేరుగాంచి విజయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచేది కొంతమంది ఆటగాళ్లు మాత్రమే. అలాంటి ఆటగాళ్ల జాబితాలో అగ్రతాంబులం అందుకునే వాళ్లలో సంగక్కర కూడా ఒకడు. అలాంటి స్టార్ బ్యాట్స్ మెన్ క్రికెట్ ప్రపంచం గురించి త్వరలో వీడ్కోలు తీసుకోబోతున్నాడు. అలాంటి ఆటగాడికి మరో అరుదైన గౌరవం లభించబోతుంది.  అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న కొద్దిసేపటికే శ్రీలంక క్రికెట్ దిగ్జజం కుమార్ సంగక్కరను అత్యున్నత పదవి వరించింది. ఇంగ్లాండులో శ్రీలంక హై కమిషనర్‌గా సంగక్కరను నియమిస్తున్నారు. శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. అంతర్జాతీయ క్రికెట్‌కు కుమార్ సంగక్కర సోమవారం వీడ్కోలు చెప్పిన విషయం తెలిసిందే. వీడ్కోలు కార్యక్రమానికి శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన కూడా హాజరయ్యారు. సంగక్కర విజయాలను ఆయన ప్రశంసించారు. సంగక్కరను ఇంగ్లాండులో శ్రీలంక హై కమిషనర్‌గా నియమిస్తున్నట్లు వెంటనే ప్రకటించారు. వీడ్కోలు చెబుతూ తీవ్ర ఉద్వేగానికి గురైన సంగక్కర తనకు ఇవ్వజూపిన పదవిపై మాట్లాడలేదు. సంగక్కర 15 ఏళ్ల పాటు శ్రీలంక క్రికెట్‌కు వెన్నెముకగా నిలిచాడు. ప్రపంచ మేటి క్రికెటర్లలో ఒక్కడిగా పేరు గాంచాడు. అలాంటి ఆటగాడికి పదవులు చిన్న తురుపు ముక్కలు మాత్రమే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ