అతన్ని అడ్డుకోవడమే మా టార్గెట్

August 19, 2015 | 05:40 PM | 1 Views
ప్రింట్ కామెంట్
amit_mishra_about_chandimal_second_test_niharonline

గాలె టెస్ట్ ఓటమిపై ఇంకా సమీక్షలు నిర్వహిస్తూ వస్తుంది భారత క్రికెట్ జట్టు. మమ అంటూ గెలవాల్సిన మ్యాచ్ ను దారుణంగా ఓడి సీనియర్ల నుంచి చివాట్టు పెట్టించకుంది టీం. ఇక దాదాపు ఇన్నింగ్స్ ఓటమి ఖాయమనుకున్న దశలో అద్భుత బ్యాటింగ్ ఇన్నింగ్స్ తో లంక ను విజయ తీరాలకు చేర్చాడు దినేశ్ చండీమల్.  గెలుపు తొలి టెస్టులో అజేయ సెంచరీ సాధించిన శ్రీలంక బ్యాట్స్‌మన్ దినేశ్ చండిమల్ మరోసారి అలాంటి ప్రదర్శన ఇవ్వకుండా అడ్డుకుని తీరుతామని లెగ్‌స్పిన్నర్ అమిత్ మిశ్రా అంటున్నాడు. ‘చండిమల్ వీడియోలను మేము చూసాం. టీమ్ మీటింగ్‌లో అతని గురించి తప్పకుండా ఎక్కువగానే చర్చిస్తాం. అతడ్ని ఎలా కట్టడి చేయాలనే దానిపై చర్చిస్తాం. వ్యూహానికి అనుగుణంగా ఫీల్డ్‌ను సెట్ చేసి వీలయినంత ఎక్కువ ఒత్తిడి తెస్తాం. అతనిపై దాడి కొనసాగిస్తూనే ఉంటాం’ అని మంగళవారం ఇక్కడి పి సారా ఓవల్ స్టేడియంలో ప్రాక్టీస్ అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ మిశ్రా చెప్పాడు.

                            ఇటీవలి విదేశీ పర్యటనల్లో భారతీయ బ్యాట్స్‌మెన్ స్పిన్నర్లకు ఎక్కువ వికెట్లు సమర్పించుకున్నారు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలలో మోయిన్ అలీ, నాథన్ లియాన్‌లు వాళ్ల పాలిట సింహస్వప్నంగా మారిన విషయం తెలిసిందే. అలాగే శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో రంగన హెరత్, తరిందు కౌశల్‌ల ధాటికి బారత బ్యాటింగ్ పేకమేడలాగా కుప్పకూలిపోయింది. అయితే భారత బ్యాట్స్‌మెన్ స్పిన్నర్లను ఆడడానికి చాలా కష్టపడుతున్నారనే వాదనతో మిశ్రా ఏకీభవించలేదు. ఒక్కో సారి ఒత్తిడిలో ఎవరైనా తప్పులు చేయడం సహజమని, అదే జరిగింది తప్ప స్పిన్‌ను ఎదుర్కొనే నైపుణ్యం మన వాళ్లలో లేదని తాను అనుకోనని మిశ్రా అన్నాడు. గాలెలో ఓటమి పాలయినప్పటికీ జట్టులో ఆత్మ విశ్వాసం పుష్కలంగా ఉందని, రెండో టెస్టులో తమ కృషిని రెట్టింపు చేయడానికి తామంతా ఎదురు చూస్తున్నామని చెప్పాడు. కాగా గురువారం ఇక్కడ సారా ఓవల్ స్టేడియంలో రెండో టెస్ట్ జరగనుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ