సంగ గురించి సహధర్మచారిణి

August 18, 2015 | 05:30 PM | 2 Views
ప్రింట్ కామెంట్
sangakkara_wife_yehali_interview_niharonline

శ్రీలంక స్టార్ క్రికెటర్ కుమార సంగక్కర భారత్ తో సిరీస్ తర్వాత క్రికెట్ కు శాశ్వతంగా వీడ్కోలు తీసుకుంటున్నాడు. ఈ సందర్భంగా పలు చానెళ్లు ఆయన కుటుంబ సభ్యులను ఇంటర్వ్యూ చేశాయి. ఈ సందర్భంగా స్టార్ క్రికెటర్ సతీమణి యెహలీ భర్త గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసింది.

                            సంగక్కర మంచ క్రికెటరే కాదు మంచి భర్త, అంతకు మించి ఉత్తమ తండ్రి. కుటుంబమంటే ఆయనకు చాలా ఇష్టమట. ఏ విషయానైనా కూల్ గా తీసుకుంటారని, బాధలోంచి త్వరగా బయటపడతారని ఆమె చెప్పారు. సంగక్కర వంట కూడా ఇరగదీస్తాడట. తనకు రెస్ట్ ఇచ్చి మరీ సంగ వంట మీద పడిపోతాడట. గాలే టెస్ట్ లో తక్కువ స్కోర్ కే అవుటవ్వటం చాలా నిరాశ పరించిదని చెప్పుకొచ్చింది. టెస్ట్ ల నుంచి రిటైర్మెంట్ అయ్యాక దేశీవాళీ క్రికెట్ లో మరో మూడేళ్లు కొనసాగాక పూర్తిగా కుటుంబంపైనే దృష్టిసారించాలని అనుకుంటున్నాడని తెలిపింది. ప్రతిక్షణం జట్టు కోసం తాపత్రయపడే వ్యక్తి సంగక్కర అని, సంగక్కర మైదానంలో ఉన్నప్పుడు తాను ఆట బాగా ఎంజాయ్ చేస్తున్నానని ఆమె తెలిపింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ