నిషేధం ఎత్తేయడమా? నో చాన్స్...

July 29, 2015 | 04:26 PM | 2 Views
ప్రింట్ కామెంట్
Anurag_Thakur_BCCI_sreeshanth_niharonline

బంతి పట్టి మళ్లీ మైదానంలో దిగి గోల చేద్దామనుకుంటున్న శ్రీశాంత్ ఆశలపై బీసీసీఐ నీళ్లు చల్లింది.  స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల నుంచి ఇటీవలె నిర్దోషిగా బయటపడిన ముగ్గురు క్రికెటర్లపై నిషేధాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎత్తివేసే ప్రసక్తే లేదని ప్రకటించింది. ఈ విషయంలో రెండో ఆలోచన చేసే ప్రసక్తే లేదని ప్రకటించింది. 2013 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో ముగ్గురు ఆటగాళ్లపై ఆరోపణలు వచ్చాయి. వీరిలో శ్రీశాంత్, చవాన్ లను అరెస్ట్ చేయగా, వీరి పై బోర్డు జీవితకాల నిషేధం విధించింది. ఇక మరో ఆటగాడు చండీలాపై ఆరోపణలను బోర్డు ఇంకా విచారిస్తూనే ఉంది. కాగా, ఇటీవల ఢిల్లీ న్యాయస్థానం ఈ ముగ్గురు ఆటగాళ్లతో సహా ఇతరులను కూడా నిర్దోషులుగా ప్రకటించింది. దీంతో తనపై ఉన్న నిషేధాన్ని తొలగించాలని  శ్రీశాంత్ కోరగా, కేరళ క్రికెట్ బోర్డు కూడా అతని తరపున బీసీసీఐకి విజ్నప్తి చేసింది. అయితే వారిపై నిషేధం ఎట్టి పరిస్థితుల్లో ఎత్తివేసే ప్రసక్తి లేదని బీసీసీఐ కార్యదర్శి ఠాకూర్ స్పష్టంచేశారు. చట్టపరమైన చర్యలకు, బోర్డు క్రమశిక్షణ చర్యలకు సంబంధం ఉండబోదని, ఈ విషయంలో కఠిన వైఖరినే అవలంభించాలని బోర్డు నిర్ణయించిందని ఆయన ప్రకటించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ