ఆపనిచేసేది వాళ్లేగా ఫీలవ్వటం సహాజం!

July 04, 2015 | 05:49 PM | 2 Views
ప్రింట్ కామెంట్
david_warner_unhappy_sledging_ICC_niharonline

క్రికెట్ లో సర్వ సాధారణమైన పోయిన విషయం స్లెడ్జింగ్. కొన్ని సందర్భాలలో ఇది తీవ్ర ఉద్రిక్తతకు కూడా దారితీస్తూ ఉంటుంది. కాగా, దీనిపై ఎప్పటి నుంచో తీవ్ర అసంతృప్తిగా ఉన్న ఐసీసీ నిబంధన ద్వారా అడ్డుకట్ట వేసేందుకు ఫ్లాన్ వేస్తోంది. అయితే ఐసీసీ తీసుకునే ఈ నిర్ణయంపై ఆస్ట్రేలియన్ స్టార్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ తెగ ఫీలయిపోతున్నాడు. క్రికెట్ లో అసలు మజా వచ్చేదే స్లెడ్జింగ్ తో మరి అలాంటి దానిని నియంత్రిస్తే పస ఉండదని అతను అంటున్నాడు. అంతేకాదు ఈ ఆటగాడు గత 18 నెలల్లో రెండు సార్లు ఐసీసీ హెచ్చరికలకు గురయ్యాడట. వికెట్లు పడగొట్టినప్పుడు ఆటగాళ్లు సంబరం చేసుకోవటంలో తప్పేముంది. అలాంటప్పుడు కొన్ని మాటల యుద్ధాలు జరుగుతాయి. దానిని ఆటలో అరటిపండుగానే చూడాలి తప్ప పెద్దగా పట్టించుకోవద్దు అని అంటున్నాడు. అంతేగా స్లెడ్జింగ్ కు ఎక్కువగా పాల్పడేది వాళ్లేగా ఎంతైనా అంటారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ