ఆడుతున్నా... కానీ, ఛాన్స్ ఇవ్వట్లేదు

July 03, 2015 | 11:44 AM | 1 Views
ప్రింట్ కామెంట్
pujara_on_his_career_and_chances_interview_niharonline

ఛటేశ్వర పుజారా టెస్ట్ స్పెషలిస్ట్ గా తనదైన ముద్ర వేసుకున్న ఓ యంగ్ క్రికెటర్. ఒకానోక టైంలో ద్రావిడ్ లేని లోటును పూడుస్తున్నాడే అని అనిపించేలా క్రీడాభిమానాన్ని మూటగట్టుకున్నాడు. క్రమం తప్పకుండా ఆడుతున్నప్పటికీ ఇటీవల జరిగిన బంగ్లా టెస్ట్ తోపాటు అంతకు ముందు సిరీస్ లకు కూడా పుజారా ఎంపిక కాకపోవటం చర్చనీయాంశమైంది. దీనిపై పుజారా మీడియా ఎదుట స్పందించాడు. ఆటగాడి జీవితంలో ఎప్పుడూ ఇలాంటి అనుభవాలే ఎదురవుతాయి. గతంలో క్రమం తప్పకుండా ఆడే సీనియర్లను పక్కన బెట్టిన రోజులు ఉన్నాయి. అలాగని నేను కుంగిపోనూ, నా ప్రదర్శనను మరింత మెరుగుపరిచుకునేందుకు బోర్డు సమయమిచ్చిందని హ్యాపీగా ఫీలవుతా అని చెప్పాడు. కానీ, బాగా ఆడుతున్న నన్ను పక్కన ఎందుకు పెడుతున్నారో తెలీట్లేదని తన బాధను వ్యక్తపరిచాడు. టెస్ట్ మ్యాచ్ లు అంటేనే సహనానికి పరీక్ష, అలాంటి ఫార్మట్ లో రాణిస్తున్న పుజారాను ఇలా పక్కనపెట్టడం కాస్త విచారకరం. మళ్లీ తను భారత జట్టులో తిరిగి రావాలని కొరుకుందాం. అన్నట్టు ఆస్ట్రేలియా ఏ జట్టుతో జరిగే మ్యాచ్ కు పుజారా కెప్టెన్ గా నియమితుడయ్యాడు.  

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ