ఆ ఇద్దరికి బీసీసీఐ క్లీన్ చిట్

June 30, 2015 | 10:44 AM | 2 Views
ప్రింట్ కామెంట్
Suresh_Raina_Ravindra_Jadeja_lalit_modi_spot_fixing_niharonline

లలిత్ మోదీ ఇప్పుడీ పేరు వింటే రాజకీయ నేతలే కాదు. ఇండియన్ క్రికెట్ టీంలోని కొందరు ఆటగాళ్లు గజగజ వణికిపోతున్నారు. ఎప్పుడు ఏం బాంబు పేలుస్తారన్న భయంతో వారంతా ఆందోళనలో ఉన్నారు. తాజాగా ఐపీఎల్ ఫిక్సింగ్ లో ఫిక్సింగ్ కు పాల్పడి భారీగా ముడుపులు అందుకున్నారని లతిత్ మోదీ ఆరోపించారు. చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లైన సురేష్ రైనా, జడేజా, బ్రేవ్ లకు ఓ రియల్ ఎస్టేట్ దిగ్గజం భారీ ముడుపులు అప్పజెప్పారని మోదీ ఆరోపించారు. అంతేగాదు ఈ మేరకు ఐసీసీ కి ఓ మెయిల్ కూడా పంపాడు. ఈ విషయం బీసీసీఐకి కూడా తెలుసని ఆయన వ్యాఖ్యానించారు. ఇక ఈ ఆరోపణలకు సంబంధించి బీసీసీఐ వారిద్దరికి క్లీన్ చిట్ ఇచ్చింది. వారు ఎటువంటి ముడుపులు అందుకోలేదని బోర్డు సెక్రటరీ అనురాగ్ ఠాకూర్ సోమవారం స్పష్టం చేశారు. ఈ మేరకు జింబాబ్వే పర్యటనకు భారత జట్టును ప్రకటించిన అనంతరం అనురాగ్ మీడియాతో మాట్లాడారు. అన్నట్లు జింబాబ్వేతో మూడు వన్డేలకు, రెండు టీ ట్వంటీల కోసం జట్టుకు రహానే సారథ్యం వహించనున్నాడు. సీనియర్లకు విశ్రాంతి ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అనురాగ్ తెలిపారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ