రహానే పై సచిన్ ప్రశంసల జల్లు...

June 30, 2015 | 05:53 PM | 7 Views
ప్రింట్ కామెంట్
sachin_praises_rahane_over_captaincy_for_zimbambe_tour_niharonline

జింబాబ్వే పర్యటనకు ధోనీ, కోహ్లీ వంటి బడాస్టార్లకు విశ్రాంతినిచ్చిన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ అజింక్యా రహానే కు సారథ్య బాధ్యతలు అప్పగించడం సంచలనంగా మారింది. ఇక ఈ ముంబై క్రికెటర్ కు బాధ్యతలు అప్పగించటంపై బ్యాటింగ్ ఐకాన్ సచిన్ టెండూల్కర్ స్పందించాడు. రహానే కెప్టెన్ గా ఎంపికైనందుకు అభినందనలు తెలిపారు. అజింక్యాకు కెప్టెన్సీ దక్కడం చాలా సంతోషం కలిగించింది. అతను చిత్తశుద్ధి కలిగిన క్రికెటర్. కఠోరంగా శ్రమిస్తాడు. ఆట పట్ల అతని నిబద్ధత, అంకిత భావం ఎల్లప్పూడూ నన్ను ఆకట్టుకునేవి. కెప్టెన్ గా రాణించి, మాకందరికీ గర్వకారణంగా నిలుస్తాడని ఖచ్ఛితంగా చెప్పగలను. అతని శుభాకాంక్షలు తెలుపుతున్నాను అని పేర్కొన్నాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ