పిచ్చెక్కిస్తున్న మొహాలీ పిచ్

November 06, 2015 | 03:10 PM | 1 Views
ప్రింట్ కామెంట్
mohali-not-a-good-cricket-pitch-niharonline

పిచ్ అన్ని వర్గాలకు అనుకూలంగా ఉంటుందని మొహాలీ గ్రౌండ్ నిర్వాహకులు ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ, మొదటి టెస్ట్ ఆడుతున్న జట్లు ఇదేం పిచ్ రా బాబూ అని తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఊహించి ఉండరు. మొదటి ఇన్నింగ్స్ లో 201 పరుగులకే భారత్ ను కట్టడి చేసిన సౌతాఫ్రికా ఇప్పుడు సేమ్ అనుభవాన్ని చవిచూసింది. భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దాటికి దక్షిణాఫ్రికా చాపచుట్టేసింది. కీలకమైన ఆటగాళ్లలో ఐదుగురిని అశ్విన్ అవుట్ చేయడంతో, చావు దెబ్బతిన్న సౌతాఫ్రికా జట్టులోని మిగతా ఆటగాళ్లను జడేజా, మిశ్రాలు పెవీలియన్ దారి పట్టించారు. దీంతో రెండో రోజు ఆటలో టీ విరామానికి ముందే 184 పరుగులకు ఆ జట్టు ఆలౌటైంది.

అర్థ సెంచరీతో భారత బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచిన డివిలియన్స్ 63 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మిశ్రాకు దొరికిపోయాడు. ఇక టెయిలెండర్లు ఎవరూ పెద్దగా రాణించకపోవటంతో 184 కి ప్యాక్ చెప్పేసింది. దీంతో భారత్ కి మొదటి ఇన్నింగ్స్ లో 17 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించినట్లయ్యింది. రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన భాతర్ కి ఆదిలోనే దెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ ప్రారంభించిన కాసేపటికే ఓపెనర్ శిఖర్ ధావన్ మరోసారి డక్కౌట్ అయ్యాడు. ఫిలాండర్ బౌలింగ్ లో డెవిలియర్స్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం భారత స్కోరు 18 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 53 పరుగులు. మరో మూడు రోజులు ఆట ఉండే సరికి ఫలితం ఖచ్ఛితంగా తేలే అవకాశం ఉందని స్పష్టం అవుతుంది. ఇక ఆటగాళ్లకే కాదు ఆటను ఆస్వాదిద్దామని వచ్చిన క్రీడాభిమానులకు 'ఇదేం పిచ్ రా బాబూ' అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ