శ్రీశాంత్ కు షాకిచ్చిన ఢిల్లీ హైకోర్టు

November 18, 2015 | 12:52 PM | 1 Views
ప్రింట్ కామెంట్
delhi_high_court_sreeshanth_niharonline

స్పాట్ ఫిక్సింగ్ కేసులో పీకల్లోతు ఆరోపణల్లో కూరుకుపోయి బయటపడిన క్రికెటర్ శ్రీశాంత్ కు మళ్లీ చిక్కులు తప్పేలా లేవు. విశ్వవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన ఐపీఎల్ లో ఫిక్సింగ్ కు పాల్పడి శ్రీశాంత్, చండీలా, అంకిత్ చవాన్ ను క్రీడాభిమానులను నివ్వెరపరిచారు. దీనిపై తొలుత విచారణ చేపట్టిన ట్రైబ్యునల్ కోర్టు ముగ్గురు క్రికెటర్లను నిర్దోషులుగా ప్రకటించింది.

అయితే ఈ తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఢిల్లీ పోలీసులు తీర్పును ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ మేరకు పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో మరోమారు పూర్తి స్థాయిలో విచారణ జరగనుంది. అంతేకాక ఈ దఫా మరింత కీలక సమాచారాన్ని పక్కా ఆధారాలతో కోర్టుకు సమర్పించేందుకు ఢిల్లీ పోలీసులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. దీంతో హైకోర్టు విచారణలో శ్రీశాంత్ సహా ముగ్గురు క్రికెటర్లపై ఎలాంటి నిర్ణయం వెలువడనుందన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ