కూల్ కెప్టెన్ హాట్ అయితే షాక్ తప్పదు

June 20, 2015 | 04:26 PM | 5 Views
ప్రింట్ కామెంట్
dhoni_mustafizur_collassion_fined_niharonline

భారత వన్డే జట్టు కెప్టెన్ ధోనీ మైదానంలో ఉన్నప్పుడు ఎలా ఉంటాడో మనందరికీ తెలుసు. ఎంత టెన్షన్ పరిస్థితుల్లో అయినా ప్రశాంతంగా ఉంటాడు. అందుకే ఆయనను అందరూ కెప్టెన్ కూల్ అంటుంటారు. అలాంటి కూల్ కెప్టెన్ హాట్‌గా మారితే. బంగ్లాతో జరిగిన తొలివన్డేలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇండియా ఇన్నింగ్స్ 25వ ఓవర్లో  సింగిల్ తీసేందుకు ధోనీ ప్రయత్నించగా బౌలర్ ముస్తఫిజుర్ అడ్డుగా వచ్చాడు. దీంతో ఆగ్రహించిన ధోని, ముస్తఫిజుర్ ను నెట్టి మరీ పరుగు తీశాడు. ఎప్పుడూ శాంతంగా ఉండే ధోనీ ఇలా కోపం తెచ్చుకోవటంతో బంగ్లా ఆటగాళ్లతోసహా పెవిలియన్ లో ఉన్న భారత ఆటగాళ్లు కూడా షాక్ కి గురయ్యారట. ఇక ఈ విషయంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సీరియస్ అయ్యింది. ధోని మ్యాచ్ ఫీజులో 75 శాతం మొత్తాన్ని జరిమానాగా కూడా విధించింది. అయితే ధోనీ తోసిన తోపుడుకు ముస్తఫిజుర్ కొద్ది సేపు మైదానం కూడా వీడాల్సి వచ్చింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ