అందరూ వేస్తున్నా వర్కవుట్ కావట్లేదు

December 07, 2015 | 12:23 PM | 1 Views
ప్రింట్ కామెంట్
faf-du-plessis-most-balls-for-first-run-record-india-test-niharonline

టెస్ట్  సిరీస్ లో ఘోర పరాభవాన్ని చవిచూస్తున్న సౌతాఫ్రికా నాలుగో టెస్ట్ ను ఎట్టి పరిస్థితుల్లో చేజారనీయకూడదని శత విధాల ప్రయత్నిస్తోంది. ఇందుకోసం టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇంత వరకు ఏ దేశం కూడా చేయని రీతిలో డిఫెన్స్ ఆటను ప్రదర్శిస్తోంది. ఆటగాళ్లు ఆడే షాట్లకు బంతిని క్రీజు కూడా దాటనీయట్లేదంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక వారి వికెట్లు తీసి పరాజయాన్ని పరిపూర్ణం చేసేందుకు కోహ్లీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. వికెట్ కీపర్ సాహా, రహానే, రోహిత్ శర్మలు తప్ప అందరూ బంతి పట్టి తల ఓ చెయ్యి వేశారు. అయినా వికెట్లు పడటం లేదు.

                                తన జిడ్డు ఆటతో భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ వచ్చిన దక్షిణాఫ్రికా కెప్టెన్ హషీమ్ ఆమ్లా వికెట్ ను జడేజా దక్కించుకున్నాడు. దీంతో 42.1 ఓవర్ల పాటు సాగి కేవలం 27 పరుగులు జోడించిన ఆమ్లా, డివిలియర్స్ జోడీ విడిపోయింది. మొత్తం 244 బంతులాడిన ఆమ్లా 25 పరుగులు చేశాడు. ఇక టెస్టు క్రికెట్ చరిత్రలో తొలి పరుగును చేసేందుకు అత్యధిక బంతులను తీసుకున్న ఆటగాడిగా డుప్లెసిస్ సరికొత్త రికార్డును సృష్టించాడు. తొలి పరుగు చేసేందుకు 53 బంతులను తీసుకున్నాడు. అంతకు ముందు ఆ రికార్డు న్యూజిలాండ్ ఆటగాడు ఎక్ స్టీన్ పేరిట ఉంది. అతను తన తొలి పరుగుకు 46 బంతులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ఇదే మ్యాచ్ లో ఆమ్లా కూడా దాదాపు ఇలాంటి రికార్డు నెలకొల్పాడు. మొదటి పరుగు కోసం ఆమ్లా కూడా 45 బంతులాడిన సంగతి తెలిసిందే. మరో 54 ఓవర్ల పాటు వికెట్లను కాపాడుకుంటే, దక్షిణాఫ్రికా ఈ టెస్టును డ్రాగా ముగించుకుంటుంది. ప్రస్తుతం కోహ్లీ తన అమ్ముల పొదిలోని ఆలోచనల్నింటికీ ఆచరణ రూపం ఇస్తున్నాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ