వరల్డ్ కప్ పోయినా ఫర్లేదు పరువు, ప్రతిష్ట ఇదే!

July 07, 2015 | 05:59 PM | 1 Views
ప్రింట్ కామెంట్
england_australia_ashes_2015_niharonline

ప్రతిష్టాత్మక వరల్డ్ కప్ గెలవకపోయినా ఫర్వాలేదు, కానీ ఇది మాత్రం గెలిచి తీరాలి. పసికూనల చేతిలో చిత్తుగా ఓడినా ఫర్వాలేదు కానీ, దీని ఓటమిని మాత్రం జీర్ణించుకోలేరు. దాదాపు 125 ఏళ్ల చరిత్ర కలిగిన యాషెస్ సిరీస్ గురించే ఇదంతా. అటు ఆస్ట్రేలియా, ఇటు ఇంగ్లాండ్ రెండు దేశాల్లోనూ ఈ సిరీస్ గురించే ఫైటింగ్. తమ కెరీర్ లో ఒక్కసారైనా ఈ సిరీస్ ను ముద్దాడాలన్నదే రెండూ దేశాల క్రీడాకారుల టార్గెట్. అందుకే యాషెస్ ను ప్రాణప్రదంగా, పరువుగా భావిస్తారంతా. యాషెస్ అంటే బూడిద. కానీ, వారికది బంగారం కన్నా కోటిరెట్లు ఎక్కవ. దేశంతో సంబంధం లేకుండా ప్రతీ అభిమానిని ఈ సిరీస్ ను ఎంజాయ్ చేస్తారు. భారత్ పాక్ ల మ్యాచ్ తర్వాత అంతటి క్రేజ్ ఉన్న సిరీస్ ఇదే. అసలు టెస్ట్ మజా దొరికేది కూడా ఇందులోనే. ఇక ఈ బుధవారం నుంచి యాషెస్ ప్రారంభంకానుంది. సొంతగడ్డపై ప్రతీకారం కోసం ఇంగ్లాండ్ చూస్తుండగా, వారిని ఓడించాలని కంగారులు కాపు కాసి ఉన్నారు. చూద్ధాం... ఏమౌతుందో...

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ